నెలసరి రక్తస్రావం తీవ్రంగా లేదా రక్తస్రావం ఎక్కువకాలం కొనసాగుతుంటే నేనేం చేయాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

* ఒక గంట కంటే తక్కువ సమయంలోనే ప్యాడ్ లేదా వస్త్రం రక్తస్రావంతో నిండిపోతే, నెలసరి రక్తస్రావం తీవ్రంగా ఉందని అర్థం.

  • నెలసరి రక్తస్రావం 8 రోజుల కంటే మించి కొనసాగితే, నెలసరి ఎక్కువకాలం కొనసాగుతోందని అర్థం.
  • రక్తం గడ్డలు (మృదువైన, ముదురు ఎరుపు రంగుతో కాలేయం ముక్కల్లాంటి మెరిసే గడ్డలు కనిపించడం) కూడా అధిక రక్తస్రావానికి ఒక సంకేతం.
  • అధిక రక్తస్రావం అనే పరిస్థితి అనేక వారాలు, నెలలు లేదా సంవత్సరాలు కొనసాగితే, బలహీన రక్తం (రక్తహీనత) పరిస్థితి ఎదురుకావచ్చు.

ఈ అంశాలు కారణం కావచ్చు:

  • హార్మోన్లు సమతుల్యత కోల్పోయిన కారణంగా, అండాశయం నుండి అండం విడుదల కాకుండా ఉండొచ్చు. 20 ఏళ్ల కంటే తక్కువ మరియు 40ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు మహిళల్లో ఇది సర్వసాధారణం.
  • గర్భాశయ-అంతర పరికరం (IUD) వల్ల కూడా నెలసరి రక్తస్రావం అధికం కాగలదు.
  • మీరు గర్భవతి అయారని మీకు తెలియకుండానే జరిగిపోయే గర్భస్రావం.
  • రక్తస్రావంతో పాటు మీకు పొత్తికడుపులో నొప్పి కూడా ఉంటే, మీకు గర్భాశయం వెలుపల, గొట్టంలో గర్భం ఏర్పడి ఉండవచ్చు. ఇది అత్యవసర పరిస్థితి. తక్షణం ఆసుపత్రికి వెళ్ళండి.
  • మీకు థైరాయిడ్ గ్రంథి సమస్య ఉండొచ్చు.
  • \\tమీకు గర్భాశయంలో పెరుగుదలలు (ఫైబ్రాయిడ్లు లేదా పాలిప్స్) లేదా క్యాన్సర్ ఉండవచ్చు.

గుర్తుంచుకోండి: మీకు అధిక రక్తస్రావంతో పాటు క్రింది పరిస్థితి కూడా ఉంటే, కటి పరీక్ష కోసం శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త వద్దకు వెళ్లండి:

  • మీ యోని నుండి రక్తం కారుతుండడం.
  • నెలవారీ రక్తస్రావం అధికంగా మరియు 3 నెలలుగా కొనసాగుతుండడం.
  • మీరు గర్భవతి అయ్యారని మీకు అనిపిస్తే.
  • రక్తస్రావంతో పాటు మీకు తీవ్రమైన నొప్పి ఉంటే.
Sources
  • Audiopedia ID: tel010220