నేను 'సురక్షిత సెక్స్' అనుసరించాల్సిన అవసరమేమిటి
మనుష్యులకు సోకే అన్ని ఇతర ఇన్ఫెక్షన్లు లాగే, లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు (STIలు) కూడా సూక్ష్మక్రిముల వల్లే సోకుతాయి. గాలి, ఆహారం లేదా నీటి ద్వారా సంక్రమించే సూక్ష్మక్రిముల వల్ల కొన్ని అంటువ్యాధులు సంభవిస్తాయి. STIలు లైంగిక సంపర్కం ద్వారా సంక్రమిస్తాయి. కొన్ని STIలు జననేంద్రియాల మీద పుండ్లు లేదా స్రావాలకు కారణమవుతాయి. అయితే, ఒక వ్యక్తిని సాధారణంగా చూసినప్పుడు వారికి STI ఉందా, లేదా అని మీరు చెప్పలేరు. చాలామంది పురుషులు మరియు మహిళలు వారికి తెలియకుండానే STIలు కలిగి ఉండవచ్చు. కొన్ని STIలకు కారణమయ్యే సూక్ష్మక్రిములు (జననేంద్రియాల మీద పులిపిర్లు లేదా హెర్పెస్ వంటివి) చర్మం మీద ఉంటాయి మరియు ఇవి చర్మానికి చర్మం తగలడం వల్ల కూడా సంక్రమిస్తాయి.
ఇతర STIలకు (గనేరియా, క్లమీడియా, హెపటైటిస్, సిఫిలిస్ మరియు HIV లాంటివి) కారణమయ్యే సూక్ష్మక్రిములు ఆ వ్యాధి సోకిన వ్యక్తి శరీర ద్రవాల్లో ఉంటాయి. వ్యాధి సోకిన వ్యక్తి రక్తం, వీర్యం లేదా తేమగా ఉండే యోని ఇతరుల చర్మం, పాయువు, పురుషాంగం కొన లేదా ఆ వ్యక్తి నోటికి తాకినప్పుడు ఈ వ్యాధులు సంక్రమిస్తాయి. కాబట్టి, మీ భాగస్వామి అతను లేదా ఆమెకి ఎలాంటి STIలు లేవని ఖచ్చితంగా తెలిస్తే, తప్ప మీరు సురక్షిత లైంగిక ప్రక్రియ అనుసరించడంలో భాగంగా, వారి జననేంద్రియాల చర్మంతో మరియు అతని లేదా ఆమె శరీర ద్రవాలతో సాధ్యమైనంత తక్కువ సంబంధం కలిగి ఉండాలి. ఈ ఇన్ఫెక్షన్లన్నీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. జీవితాంతం కొనసాగే చికిత్స లేకపోతే, HIV ప్రాణాంతకం కాగలదు.
అసురక్షిత లైంగిక సంబంధాలకు పాల్పడడం లేదా ఎక్కువ మంది భాగస్వాములతో లైంగిక ప్రక్రియలో పాల్గొనడం వల్ల, ఒక మహిళకు HIV సోకడంతో సహా STI వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. HIV సోకినప్పుడు దానివల్ల ఎయిడ్స్ రావడమే కాకుండా, మరణానికి దారితీయగలదు. చికిత్స చేయని STIల కారణంగా వంధ్యత్వం, గొట్టంలో గర్భం పెరగడం మరియు గర్భస్రావం లాంటి వాటికి దారితీస్తాయి. ఎక్కువ మంది భాగస్వాములతో సెక్స్ కారణంగా, మహిళకు కటి శోథ వ్యాధి (PID) మరియు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సురక్షిత లైంగిక చర్య కొనసాగించడం ద్వారా, మహిళలు మరియు పురుషులు ఈ సమస్యలన్నింటి నుండి తప్పించుకోవచ్చు.