నేను ఎందుకోసం క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలకు వెళ్లాలి
\\ లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STDలు) మరియు క్యాన్సర్లు లాంటి చాలా వ్యాధులు బాగా ముదిరే వరకు లక్షణాలు కనిపించవు. లక్షణాలు కనిపించే నాటికి ఆ సమస్యకు చికిత్స చేయలేని పరిస్థితి ఎదురు కావచ్చు.
ఒక మహిళ తనలో ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ, ప్రతి 3 నుండి 5 సంవత్సరాలకు ఒకసారి తన పునరుత్పత్తి వ్యవస్థ పరీక్షల కోసం శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తను సంప్రదించాలి. ఈ సందర్భంగా, ఆ మహిళ కటి పరీక్ష, రొమ్ము పరీక్ష, రక్త పరీక్ష (రక్తహీనత కోసం) లాంటివి చేయించుకోవడంతో పాటు, లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు (STIలు) సోకే ప్రమాదం ఉంటే, సంబంధిత పరీక్షలు కూడా చేయించుకోవాలి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గుర్తించడానికి చేసే పాప్ పరీక్ష లేదా ఇతర పరీక్షలు కూడా ఇందులో ఉండవచ్చు. 35 ఏళ్లు పైబడిన మహిళలు ఈ పరీక్షలు తప్పక చేయించుకోవాలి. ఎందుకంటే, మహిళల్లో వయస్సు పెరిగే కొద్దీ గర్భాశయ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.