నేను ఏవిధంగా సురక్షిత గర్భస్రావం చేయించుకోగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

ఒక మహిళకు అవాంఛిత గర్భం అనే సమస్య ఎదురైనప్పుడు, సురక్షితమైన మరియు చట్టబద్ధమైన గర్భస్రావం అనే పరిష్కారం ఆమెకి అందుబాటులో ఉండాలి. అయితే, గర్భస్రావం సంబంధిత చట్టాలనేవి ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉన్నాయి:

గర్భస్రావం చట్టబద్ధమైనది: గర్భస్రావం చట్టబద్ధమే అనే పరిస్థితి ఉన్నప్పుడు, ఆరోగ్య కేంద్రం లేదా ఆసుపత్రికి వెళ్లి, రుసుము చెల్లించడం ద్వారా, ఒక మహిళ సురక్షితంగా గర్భస్రావం చేయించుకోగలదు. ఇలాంటి పరిస్థితి ఉన్న దేశాల్లో, దాదాపుగా ఏ స్త్రీ అనారోగ్యానికి గురికాదు లేదా గర్భస్రావంతో వచ్చే సమస్యల వల్ల మరణించదు.

కొన్ని సందర్భాల్లో మాత్రమే గర్భస్రావం చట్టబద్ధమైనది: కొన్ని దేశాల్లోని చట్టాల ప్రకారం, కొన్ని నిర్ధిష్ట సందర్భాల్లో మాత్రమే గర్భస్రావం చట్టబద్ధమైనది. ఆ సందర్భాలు:

  • అత్యాచారం లేదా రక్త సంబంధీకులు (సన్నిహిత కుటుంబ సభ్యుడితో లైంగిక సంబంధం) కారణంగా ఒక మహిళ గర్భం దాల్చినప్పుడు.
  • గర్భం అనేది ఆ స్త్రీ ఆరోగ్యానికి ప్రమాదం అని వైద్యుడు నిర్ధారిస్తే.

అయితే, పేర్కొన్న కారణాలతో గర్భస్రావం చేయించుకోవడం కూడా కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది. నిజానికి, చట్టం ఏం చెబుతుందో వైద్యులు మరియు ఆరోగ్య కార్యకర్తలకు స్పష్టంగా తెలియకపోవచ్చు. బహిరంగ గర్భస్రావం చేయడానికి వాళ్లు ఇష్టపడకపోవచ్చు లేదా వాళ్లు పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయవచ్చు. తమ దేశంలో గర్భస్రావం చట్టబద్ధమైనదేనా, అలాంటిది అందుబాటులో ఉందా అనే విషయం మహిళలకు తెలియకపోవచ్చు.

చట్టబద్ధమైనప్పటికీ, చట్టబద్ధం కాకపోయినప్పటికీ, ఖరీదైనది, చాలాదూరం వెళ్లాలి లేదా గందరగోళ నిబంధనలు లేదా చాలా ఫారాలు నింపాల్సి రావడం లాంటి కారణాలతో సురక్షిత గర్భస్రావం పొందడం కష్టతరంగా ఉంటుంది. ఈ కారణాల వల్ల పేద మహిళలకు లేదా వైద్య వ్యవస్థ గురించి తెలియని మహిళలకు సురక్షిత గర్భస్రావం పొందడం తరచుగా చాలా కష్టతరంగా ఉంటుంది. దురదృష్టవశాత్తూ, చాలా ప్రదేశాల్లో, ప్రైవేట్ వైద్యుడికి డబ్బు చెల్లించే స్థోమత కలిగిన మహిళలు మాత్రమే సురక్షిత గర్భస్రావం పొందగల పరిస్థితి ఉంటుంది.

చట్టవిరుద్ధ గర్భస్రావం: గర్భస్రావం చట్టబద్ధం కాదనే పరిస్థితి ఉన్నచోట, గర్భస్రావం చేయించుకున్న మహిళనీ మరియు ఆ పని చేసిన వ్యక్తినీ అరెస్టు చేయవచ్చు. చాలా చోట్ల ఇలా జరగదు. కానీ, గర్భస్రావం చట్ట వ్యతిరేకం అనే పరిస్థితి ఉన్న చోట, అసురక్షిత గర్భస్రావం మరియు అసురక్షిత గర్భం కారణంగా ఎక్కువ మంది మహిళలు మరణిస్తుంటారు. అలాంటిచోట మహిళల ఆరోగ్య సేవల కోసం ఖర్చు చేయాల్సిన డబ్బుని అసురక్షిత గర్భస్రావం వల్ల వచ్చే సమస్యలకు చికిత్స చేయడం కోసం వెచ్చిస్తుంటారు.

గుర్తుంచుకోండి: గర్భస్రావం చట్టవిరుద్ధం అని ఎప్పుడూ భావించకండి. మీ స్వంత దేశంలోని చట్టాల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించండి. చట్టాలు మార్చే ప్రయత్నం కంటే, వాటికి అనుగుణంగా వ్యవహరించడం సులభం కావచ్చు. గర్భస్రావం చట్టవిరుద్ధమైనప్పటికీ, సురక్షిత గర్భస్రావం సేవలు అందించే వ్యక్తులు అందుబాటులో ఉండవచ్చు. సురక్షిత గర్భస్రావం కోసం మార్గం కనుగొనడమనేది ప్రాణాలతో ఉండడమా లేదా చనిపోవడమా అని నిర్ణయించేది కాగలదు.

Sources
  • Audiopedia ID: tel020205