నేను నా తల్లిదండ్రులతో ఏవిధంగా మెరుగ్గా మాట్లాడగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

మీ తల్లి లేదా తండ్రితో మాట్లాడడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. మీరు సంప్రదాయం ప్రకారం జీవించాలని మీ తల్లిదండ్రులు కోరుకోవచ్చు. కానీ, కాలం మారుతోందని మీరు భావిస్తుంటారు. కాబట్టి, మీ తల్లిదండ్రులు మీ మాట వినడం లేదనో, మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదోనో మీకు అనిపించవచ్చు లేదా వాళ్లు కోప్పడుతారని మీరు భయపడవచ్చు.

మీరు చెప్పే ప్రతిదానితో ఏకీభవించనప్పటికీ, మీ మీద మీ కుటుంబానికి ప్రేమ ఉండవచ్చు. మీ క్షేమం కోరుకుంటున్నారు కాబట్టే వాళ్లు మీ మీద కోప్పడవచ్చు. అది మీ మీద ప్రేమ లేకపోవడం కాదు. వారితో గౌరవంగా మాట్లాడటానికి ప్రయత్నించండి మరియు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడంలో వారికి సహాయం అందించండి.

మెరుగైన సంభాషణ కోసం మార్గాలు

  • మీ తల్లిదండ్రులు బిజీగా ఉన్నప్పుడు, అలసిపోయి ఉండడం లేదా వేరే విషయాల గురించి ఆందోళనలో ఉన్నప్పుడు కాకుండా, ఇతర మంచి సమయం ఎంచుకోండి.
  • మీ ఆందోళనలు, చింతలు మరియు లక్ష్యాలు గురించి వారికి చెప్పండి. మీ పరిస్థితిలో ఉంటే, వాళ్లేమి చేసేవాళ్లో అడగండి.
  • వాళ్లు చదవడం కోసం ఏదైనా ఇవ్వండి లేదా వారు మాట్లాడడం ప్రారంభించడానికి ఏదైనా చిత్రం చూపించండి. మీ సమస్యకు సంబంధించినదిగా ఉన్నప్పుడు, ఆ పుస్తకంలోని కొంత భాగాన్ని మీరు కలిసి చదవవచ్చు.
  • మీకు కోపం వచ్చినప్పటికీ, అరవకుండా ఉండటానికి ప్రయత్నించండి. మీ మీద మీ తల్లిదండ్రులకు కోపం రావచ్చు మరియు మీరు వారిని గౌరవించడం లేదని వాళ్లు అనుకోవచ్చు.
  • ఈ జాగ్రత్తలన్నీ పాటించినప్పటికీ, మీరు మీ తల్లిదండ్రులతో మాట్లాడలేకపోతే, మీరు మాట్లాడగలిగిన వేరొక పెద్ద వారిని ఎంచుకోండి. అది మీ ఉపాధ్యాయుడు కావచ్చు, స్నేహితుడి తల్లి కావచ్చు, అత్త కావచ్చు, అక్క కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, మీ ప్రార్థనా స్థలంలోని ఎవరైనా వ్యక్తి కావచ్చు లేదా ఆరోగ్య కార్యకర్త కావచ్చు.
Sources
  • Audiopedia ID: tel020819