నేను నా రొమ్ములను ఎలా పరీక్షించుకోవాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

ఒక అద్దం ముందు నిలబడి, అద్దంలో మీ రొమ్ములు చూడండి. మీ తల మీదుగా, మీ చేతులు పైకెత్తండి. మీ రొమ్ముల ఆకారంలో ఏదైనా మార్పు లేదా చర్మం లేదా చనుమొనల్లో ఏదైనా వాపు లేదా మార్పులు ఉన్నాయా అని చూడండి. ఆతర్వాత, మీ చేతులను క్రిందకు దించి, మరోసారి అదేవిధంగా పరిశీలించండి.

వెళ్లకిలా పడుకోండి. మీ చేతివేళ్లు నిటారుగా ఉంచి, మీ రొమ్ములు నొక్కుతూ, ఏవైనా గడ్డలు లాంటివి తగులుతున్నాయా అని పరిశీలించండి.

మీ రొమ్ములోని ప్రతి భాగం తాకారని నిర్ధారించుకోండి. తద్వారా, ప్రతినెలా ఇదే తీరుగా పరీక్షించుకోవడంలో అది మీకు సహాయపడుతుంది.

Sources
  • Audiopedia ID: tel010212