నేను నా వ్యక్తిగత భద్రత గురించి ఎందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
వైకల్యం ఉన్న స్త్రీ తనను తాను రక్షించుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి, వైకల్యం లేని మహిళతో పోలిస్తే, వైకల్యం కలిగిన మహిళ మీద హింసాత్మక దాడి జరిగే మరియు ఆమె దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, ఒక మహిళ తనను తాను రక్షించుకోవడం కోసం చేయగల కొన్ని విషయాలు ఉన్నాయి. వైకల్యం కలిగిన మహిళలు ఒక సమూహంగా ఈ విషయాల్లో కొన్నింటిని సాధన చేయడం వల్ల అది వారికి సహాయపడవచ్చు:
మీరు బహిరంగ ప్రదేశంలో ఉన్నప్పుడు, ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టడానికి లేదా దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తే, మీకు వీలైనంత బిగ్గరగా కేకలు వేయండి.
అతనికి అసహ్యంగా అనిపించే ఏదైనా చేయండి. ఉదాహరణకు ఉమ్మడం, లేదా వాంతులు చేయడం లాంటివి చేయండి లేదా మీరు 'పిచ్చి' వ్యక్తి అనిపించేలా వ్యవహరించండి.
ఆ వ్యక్తిని కొట్టడానికి లేదా భయపెట్టడానికి మీ కర్ర లేదా వీల్ చైర్ ఉపయోగించండి. మీ కుటుంబంలోనే వ్యక్తే మీ పట్ల దుర్వినియోగానికి పాల్పడే ప్రయత్నం చేస్తే, మీరు విశ్వసించే మరొక కుటుంబ సభ్యుడితో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి. వైకల్యం కలిగిన మహిళల బృందంతో ఆ విషయమై గోప్యంగా చర్చించడం కూడా సహాపడవచ్చు.