నేను నా స్వంతంగా మద్దతు సమూహం ఎలా ప్రారంభించవచ్చు
ఒక సమూహం ప్రారంభించాలనుకునే 2 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలను గుర్తించండి.
ఎప్పుడు, ఎక్కడ కలుసుకోవాలో ప్లాన్ చేయండి. పాఠశాల, ఆరోగ్య కేంద్రం, సహకార లేదా ప్రార్థనా స్థలం వంటి నిశ్శబ్ద స్థలాన్ని ఎంచుకుంటే, ఇందుకు సహాయకరంగా ఉంటుంది లేదా మీరు మీ రోజువారీ పని చేస్తున్నప్పుడు మాట్లాడుకునేలా ప్లాన్ చేసుకోవచ్చు.
మొదటి సమావేశంలో, మీరేం సాధించాలనుకుంటున్నారో చర్చించండి. మీరు ఒక సమూహంగా ఉంటే, ఆ సమూహాన్ని ఎలా నడిపించాలో మరియు రానున్న రోజుల్లో కొత్త సభ్యులను చేర్చుకోవచ్చా అని నిర్ణయించుకోండి.
సమూహం ప్రారంభించిన వ్యక్తి బహుశా మొదటి సమావేశాల్లో నాయకత్వం వహించినప్పటికీ, ఆ సమూహం కోసం ఆమె నిర్ణయాలేవీ తీసుకోకూడదు. ప్రతి ఒక్కరికీ మాట్లాడటానికి అవకాశం ఉండేలా చూసుకోవడం మరియు చర్చ దారి తప్పితే దానిని తిరిగి ప్రధాన అంశానికి తీసుకురావడం ఆమె పనిగా ఉంటుంది. మొదటి కొన్ని సమావేశాల తర్వాత, ఇతర సభ్యులూ ఆ సమూహానికి నాయకత్వం వహించాలనుకోవచ్చు. ఒకరి కంటే ఎక్కువ మంది నాయకులు ఉండడం వల్ల సిగ్గుపడే మహిళలకు నాయకత్వం వహించాలనే ప్రోత్సాహం లభించవచ్చు.