నేను పోలీసుల వద్దకు వెళితే ఏం జరుగుతుంది
చాలా చోట్ల అత్యాచారం నేరమే కానీ, మీరు అత్యాచారానికి గురయ్యారని నిరూపించడానికి చాలా సమయం పట్టవచ్చు మరియు అది చాలా కష్టం కావచ్చు.
మీరు పోలీసుల వద్దకు వెళ్లేటప్పుడు ఎవరినైనా మీతో తీసుకెళ్లండి.
ఏం జరిగిందని పోలీసులు మిమ్మల్ని అడుగుతారు. అత్యాచారం చేసిన వ్యక్తి మీకు తెలిస్తే, అతని గురించి వారికి చెప్పండి. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియకపోతే, అతడి రూపురేఖలు గురించి మీరు వివరించాల్సి ఉంటుంది. అతన్ని వెతకడం కోసం మీరు పోలీసులతో వెళ్లాల్సి రావచ్చు. పోలీసుల కోసం పనిచేసే చట్ట సంబంధిత వైద్యుడి వద్ద వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా పోలీసులు మిమ్మల్ని అడగవచ్చు. అది మీరు కోలుకోవడానికి సహాయపడే పరీక్ష కాదు. మీరు అత్యాచారానికి గురయ్యారని నిరూపించడానికి సహాయపడే పరీక్ష.
కొన్ని దేశాల్లో, అత్యాచారం మరియు హింసకు గురైన బాధితులకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన మహిళా పోలీసు అధికారులు పోలీసులతో కలిసి పనిచేశారు.
రేపిస్ట్‌ని అరెస్టు చేస్తే, పోలీసుల ముందు లేదా కోర్టులో న్యాయమూర్తి ముందు మీరు అతడిని గుర్తు పట్టాల్సి ఉంటుంది. విచారణ జరిగే పరిస్థితి ఉంటే, ఇంతకు ముందు అత్యాచారం కేసుల్లో వాదించిన న్యాయవాదిని ఎంచుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఏం ఆశించవచ్చు మరియు విచారణకు ఎలా సిద్ధం కావాలో ఆ న్యాయవాది మీకు చెబుతారు. ఎల్లప్పుడూ మీతో ఎవరినైనా వెంట తీసుకెళ్లండి.
అత్యాచారం కేసు కోసం న్యాయస్థానానికి వెళ్లడం అంత సులభం కాదు. ఏం జరిగిందో వివరించే క్రమంలో మీరు మళ్ళీ అత్యాచారానికి గురైన భావన కలగవవచ్చు. అందరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. కొందరు మిమ్మల్ని నిందించడానికి ప్రయత్నించవచ్చు లేదా మీరు అబద్ధం చెబుతున్నారనవచ్చు.