మీకు అసౌకర్యం కలిగించే లేదా మీకు బాగా పెద్దగా తెలియని వ్యక్తితో ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లడం మానుకోండి.
మీరు వెళ్లిపోవాలనుకుంటే, ఇంటికి చేరుకోవడానికి ఎల్లప్పుడూ ఒక మార్గం ఉంటుంది. ఆ వ్యక్తి సహాయం లేకుండా మీరు ఇంటికి తిరిగి రాలేననుకుంటే, అతడితో వెళ్లకపోవడమే మంచిది.
అతని వ్యాఖ్యలు లేదా స్పర్శ మీకు అసౌకర్యం కలిగిస్తోందని ఆ వ్యక్తికి చెప్పండి. అతను ప్రవర్తన మార్చుకోకపోతే, వీలైనంత త్వరగా మీరు అతడి నుండి దూరంగా వచ్చేయాలి.
మీ మీద అతనికి అధికారం ఉంటే (ఉదాహరణకు అతను మీ యజమాని, మీ వైద్యుడు, ఉపాధ్యాయుడు లేదా అధికారి అయితే):
మీకు అసౌకర్యం కలిగించేలా మొదటిసారి అతను చేసినప్పుడే, ఆపాల్సిందిగా అతడికి చెప్పండి. అతడు తన అధికారంతో పరిస్థితిని చేతిలోకి తీసుకోవాలని చూస్తుంటే, సులభంగా భయపెట్టగల వ్యక్తి కోసం అతను చూస్తాడు. మీరు అతడికి భయపడడం లేదని అతనికి తెలిసేలా చేయండి. అతను మూర్ఖంగా ఏదైనా చేయడానికి ముందే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేయాల్సిందిగా మీరు అతడిని హెచ్చరిస్తే, అతడు మీతో చెడుగా ప్రవర్తించే (ఉదాహరణకు మిమ్మల్ని తొలగించే, మీకు వైద్య సంరక్షణ నిరాకరించే లేదా మీ అభ్యర్థన తిరస్కరించే) అవకాశం తక్కువ. ఇతర మహిళలతో అతడి గురించి మాట్లాడండి. అతను ఇబ్బంది పెట్టింది మీ ఒక్కరినే కాకపోవచ్చు. మీరు అతనితో వ్యవహారం కొనసాగించాల్సి వస్తే, మీతో ఒక స్నేహితుడిని తీసుకురావడానికి ప్రయత్నించండి, తద్వారా, అతనితో మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు. అతడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇతర మహిళలను హెచ్చరించండి. హింస ద్వారా స్త్రీని నియంత్రించలేనప్పుడు ఇతర మార్గాల్లో ఆమె మీద నియంత్రణ సాధించడానికి పురుషుడు ప్రయత్నించవచ్చని తెలుసుకోండి.