నేను మంచి భవిష్యత్తును ఎలా అందుకోగలను
మీ భవిష్యత్తును ప్లాన్ చేయడానికి ప్రయత్నించండి.
మీ భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడానికి మీరు చేయగలిగే మొదటి పని లక్ష్యాలు నిర్దేశించుకోవడం. మీరేం సాధించాలనుకుంటారో అదే మీ లక్ష్యం.
చాలామంది అమ్మాయిలకు ఇదంత సులభం కాదు. తమ జీవితాలను తమ కుటుంబాలు లేదా తమ సంఘాల్లోని సంప్రదాయాలే తమని నియంత్రిస్తాయని చాలామంది భావిస్తారు. అయితే, మీకేం కావాలో తెలుసుకోవడం ద్వారా, మీకు మీరే సహాయం చేసుకోవడం ప్రారంభించవచ్చు.
ఆ తర్వాత, మీరు చేయాలనుకుంటున్న పని చేస్తున్న స్త్రీ లేదా పురుషుడితో మాట్లాడే ప్రయత్నం చేయండిడి. అది మీరు ఆరాధించే వ్యక్తి కావచ్చు లేదా మీ సమాజంలో నాయకుడు కావచ్చు. వారి పని గురించి మరింత తెలుసుకోవడానికి ఆ వ్యక్తితో సమయం వెచ్చించడానికి మీకు అవకాశం ఉంటుందా అని వాళ్లని అడగండి.
ఒక మహిళ కలలు మరియు భవిష్యత్తు మీద ఆమె ఆశలనేవి ఆమె సమాజం మరియు కుటుంబంలోని నమ్మకాలకు విరుద్ధంగా ఉండడం వల్ల కొన్నిసార్లు అమ్మాయిలు నిరాశకు గురవుతారు. మీ కలలు మరియు ఆశలు గురించి మీ పెద్దవాళ్లకు జాగ్రత్తగా వివరించడంతో పాటు వాళ్ల ఆందోళనలను కూడా శ్రద్ధగా వినడం ముఖ్యం.
మీ మాటలు వింటారని మరియు మిమ్మల్ని అర్థం చేసుకుంటారని భావించే ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్లు మీ స్నేహితురాలు, సోదరి లేదా మరొక మహిళా బంధువు కూడా కావచ్చు. మీ భయాలు మరియు సమస్యల గురించి వారితో మాట్లాడండి. మీ సమాజంలోని బలమైన మహిళల గురించి, మీ లక్ష్యాల గురించి మరియు భవిష్యత్తు కలలు గురించి మీరు వారితో మాట్లాడవచ్చు.