నేను మా ఇంటి నుండి దూరంగా పని చేస్తాను -అయినప్పటికీ నేను నా బిడ్డకి తల్లిపాలు ఇవ్వాలా

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

ఈరోజుల్లో, చాలామంది మహిళలు వారి ఇళ్ల నుండి దూరంగా పని చేస్తున్నారు. కాబట్టి, మొదటి 6 నెలలు తన బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం ఇలాంటి వారికి కష్టంగా మారుతుంది. అయితే, మీ పాలు ఇవ్వకపోతే, మీ బిడ్డ అనారోగ్యానికి గురికావచ్చు. పనిచేసే తల్లి తన పని మరియు తన బిడ్డ ఆరోగ్యంలో ఏదో ఒకటి ఎంచుకోవడం అంత సులభం కాదు.

అందుకే, పనిచేసే తల్లులకు సహాయం అవసరం. తల్లి తన బిడ్డను కొన్ని నెలల పాటు పని ప్రదేశానికి తీసుకురావడానికి కొన్ని ఉద్యోగాలు వీలు కల్పిస్తున్నాయి. ఆమె తల్లిపాలు ఇవ్వడాన్ని ఇది సులభతరం చేస్తుంది. తల్లికి సమీపంలో శిశు సంరక్షణ ఉంటే, ఆమె పని సమయంలో, విరామాల్లో తల్లిపాలు ఇవ్వగలదు. కొందరు యజమానులు శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల, తల్లిదండ్రులు వారి పిల్లలకు సన్నిహితంగా ఉండవచ్చు.

మీరు పని ప్రదేశంలో ఉన్నప్పటికీ, మీ శిశువుకి తల్లిపాలు మాత్రమే ఇవ్వడం కోసం క్రింద కొమన్ని మార్గాలు సూచించబడ్డాయి:

  • మీ బిడ్డను 6 నెలల పాటు మీకు సమీపంలో ఉంచుకోండి.
  • లేదా మీ బిడ్డకి పాలు అవసరమైనప్పుడు మీ వద్దకు తీసుకొచ్చేలా ఎవరినైనా ఏర్పాటు చేసుకోండి.
  • మీరు మీ బిడ్డ దగ్గర్లో ఉన్నప్పుడు, మీ పాలు మాత్రమే తాగించండి. మీరు రాత్రివేళ మీ శిశువుతో పడుకుంటే, ఎక్కువసార్లు మీ పాలు పట్టండి. తద్వారా, మీలో తగినంత పాలు ఉత్పత్తి కావడంలో సహాయపడుతుంది.
  • తమ శిశువుకి రొమ్ము పాలు ఇవ్వాల్సిందిగా స్నేహితులని లేదా అమ్మమ్మ లాంటి బంధువుని కొంతమంది మహిళలు అడుగుతుంటారు. వేరొక మహిళ మీ బిడ్డకి రొమ్ము పాలు ఇవ్వాలని మీరు కోరుకుంటే, ఆమెకి తప్పక HIV పరీక్ష చేయించాలి మరియు రొమ్ము పాలు ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉండదని నిర్ధారించుకోవాలి.
  • పాలిచ్చే తల్లి తన పని మధ్యలో తల్లిపాలు పిండే సమయం ఉంటే, తద్వారా, తన బిడ్డకి తల్లిపాలు అందించవచ్చు. ఆ పాలను మరొకరు తీసుకొచ్చి, ఆ బిడ్డకి తాగించవచ్చు. రోజులో 2 లేదా 3 సార్లు మీరు మీ తల్లిపాలు పిండవచ్చు. వాటిని వేరొకరితో పంపడం లేదా నిల్వ చేయడం ద్వారా, మీ బిడ్డకి తాగించవచ్చు.

గుర్తుంచుకోండి: చల్లటి స్థితిలో ఉంచలేనప్పుడు పాలు పాడవుతాయి. అలాంటి పాలు. పాలు పుల్లటి లేదా చిత్రమైన వాసనతో ఉంటే, వాటిని పారబోయండి. పాడైన తల్లిపాలు తాగిస్తే, బిడ్డ తీవ్రంగా జబ్బు పడవచ్చు.

Sources
  • Audiopedia ID: tel010807