నేను వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నేను దేనికి సిద్ధంగా ఉండాలి
మీరు వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటే, మీరు ఎదుర్కోగల కొన్ని కొత్త ఇబ్బందుల కోసం మీరు సిద్ధంగా ఉండాలి:
భద్రత ఒక మహిళకు అత్యంత ప్రమాదకర సమయం అనేది ఆమె ఇల్లు వదలి వచ్చాక ఎదురవుతుది. ఎందుకంటే, ఆమె వెళ్లిపోయినప్పుడు, ఆమె మీద అతనికి నియంత్రణ మొత్తం పోతుంది. కాబట్టి, దానిని తిరిగి పొందడం కోసం సాధారణంగా అతను ఏదైనా చేస్తాడు. ఆమెని చంపేస్తాననే తన బెదిరింపును నిజం చేయడానికి కూడా అతను ప్రయత్నించవచ్చు. కాబట్టి, అతడికి తెలియని సురక్షిత ప్రదేశంలో తాను ఉన్నానని లేదా ఆమె ఉంటున్న ప్రదేశం అతడికి తెలియదని ఆమె నిర్ధారించుకోవాలి. ఆమె ఉండే ప్రదేశం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే, ఆమె ఉండే చోటు చెప్పాల్సిందిగా వాళ్లందరినీ అతడు బలవంతం చేయవచ్చు.
మీరు స్వంతంగా మనుగడ సాగించడం మిమ్మల్ని మరియు మీ పిల్లలను పోషించుకోవడానికి మీరు ఒక మార్గం కనుగొనాలి. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మీరు కలిసి ఉండగలిగితే, మరిం విద్యను పూర్తి చేయడానికి లేదా ఉద్యోగ నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఆ సమయం ఉపయోగించుకోండి. డబ్బు ఆదా చేయడం కోసం, మీలాగే వేధింపులకు గురైన మరొక మహిళతో కలసి నివసించే ప్రయత్నం చేయండి.
భావాలు కొత్త జీవితం ఏర్పరచుకోవడం కోసం మీరు చేయాల్సిన వాటిని ఎదుర్కోవడం మీకు చాలా కష్టంగా అనిపించవచ్చు. ఒక కొత్త ప్రదేశంలో ఒంటరిగా ఉండడం మీకు అలవాటు కాలేదు కాబట్టి మీకు భయంగా మరియు ఒంటరితనంగా అనిపించవచ్చు. మీ భాగస్వామి మీకు ఎలాంటి హాని తలపెట్టినప్పటికీ, అతను లేని లోటు మీకు తెలియవచ్చు. ఏవైనా విషయాలు చాలా కష్టంగా అనిపించినప్పుడు, వచ్చేసే ముందు దీని గురించి ఆలోచించలేదే అనిపించవచ్చు. మీ భాగస్వామిని కోల్పోవడం మరియు మీ పూర్వ జీవితం గురించి బాధ నుండి బయటపడడానికి మీకు మీరే సమయం కేటాయించుకోండి. బలంగా ఉండటానికి ప్రయత్నించండి. మీలాంటి పరిస్థితిలో ఉన్న ఇతర మహిళల కోసం వెతకండి. వాళ్లతో కలసి ఉండడం వల్ల పరస్పరం ఓదార్పు పొందవచ్చు.