నేనెందుకు నా భావాలను విశ్వసించాలి
చాలామంది మహిళలకు అత్యంత చిన్న వయస్సు నుండే ఎల్లప్పుడూ మర్యాదగా ఉండాలని మరియు ఎవరినీ కించపరచకుండా ఉండేందుకు ప్రయత్నించాలని నేర్పిస్తారు. కాబట్టి, ఎవరైనా ఒక మహిళకు అసౌకర్యం కలిగించే ఏదైనా చేసినప్పటికీ, ఆమె తన భావాలకు అనుగుణంగా వ్యవహరించడానికి తరచుగా చాలా కష్టపడుతుంది. అయితే, ఇలాంటి సందర్భంలో మీరు జాగ్రత్తగా ఉండాలి:
ఇలాంటి భావాల సమయంలో మీరు చర్యకి దిగడం మీకు కష్టం కావచ్చు. ఎందుకంటే, ఇతరులు ఏం అనుకుంటారో అని మీరు భయపడుతుండవచ్చు. అలాగే, ఆ వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తి లేదా మీ మీద శ్రద్ధ వహించే వ్యక్తి అయినప్పుడు అతను మీకు హాని చేస్తాడనే మీ భావనను మీరే అంగీకరించకపోవచ్చు. అయితే, మీ భావాలను విశ్వసించడం మరియు ఏదైనా చెడు జరగడానికి ముందే మీకు అసౌకర్యంగా అనిపించే పరిస్థితి నుండి బయటపడటం ఎల్లప్పుడూ మంచిది.
మీ భావాలను విశ్వసించండి. మీకు తప్పుగా అనిపించినప్పుడు ఎదుటివారి మీద చర్య తీసుకోండి. అత్యాచారానికి గురికావడం కంటే, ఆవిధంగా చేయడమే మంచిది.