నేనెందుకు సురక్షిత లైంగిక సంబంధం అనుసరించాలి
From Audiopedia
అసురక్షిత లైంగిక సంబంధం కలిగి ఉండటం లేదా చాలా మంది భాగస్వాములతో లైంగిక సంబంధం కలిగి ఉండటం వల్ల ఒక మహిళకు HIV ఇన్ఫెక్షన్‌తో సహా, STI వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. HIV ఇన్ఫెక్షన్ కారణంగా, ఎయిడ్స్ రావడంతో పాటు మరణానికి దారితీయవచ్చు. STIలకి చికిత్స తీసుకోకపోతే వంధ్యత్వం, గర్భం నాళంలో పెరగడం మరియు గర్భస్రావానికి దారితీయవచ్చు. చాలామంది భాగస్వాములు ఉండటం వల్ల మహిళకు కటి శోథ వ్యాధి (PID) మరియు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సురక్షిత లైంగిక అలవాట్లు ద్వారా, మహిళలు మరియు పురుషులు ఈ సమస్యలన్నింటినీ నిరోధించవచ్చు.