పాత్రలు గురించి సాధారణంగా ఎదురయ్యే వైరుధ్యాలేమిటి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

సాధారణంగా, మహిళలకు ఉపాధి చాలా ముఖ్యమైనది మరియు సానుకూలమైనది. ఎందుకంటే, వాళ్లు స్వంతంగా డబ్బు సంపాదించడం వల్ల వాళ్లకి కుటుంబంలో మరింత నియంత్రణ మరియు ప్రభావంతో పాటు స్వాతంత్ర్యం కూడా పెరుగుతుంది. అధిక సామాజిక హోదా మరియు మరింత సామాజిక సంబంధం సాధ్యమవుతుంది.

భాగస్వాములిద్దరూ డబ్బు సంపాదిస్తుంటే, కుటుంబానికి ఎక్కువ ఆదాయం ఉంటుంది మరియు మెరుగైన జీవితం గడపవచ్చు మరియు చాలామంది మహిళలు పని చేసేటప్పుడు మరియు వారి కుటుంబాల కోసం ఎక్కువ ఆర్థిక బాధ్యత స్వీకరించేటప్పుడు వాళ్లు గర్వంగా మరియు మరింత సంతృప్తిగా భావిస్తారు. అయితే, తమ మహిళలు మరింత స్వతంత్రంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉండడాన్ని కొంతమంది పురుషులు ఇష్టపడరు.

అనేక దేశాల్లో మరియు సంస్కృతుల్లో కుటుంబం కోసం సంపాదించడమనేది సాంప్రదాయకంగా, పురుషుల బాధ్యత అనే భావన బలంగా ఉంటోంది. కాబట్టి తమ మహిళలు ఉద్యోగం చేయడం వల్ల కుటుంబానికి అధిపతిగా తమ సాంప్రదాయ స్థానం కోల్పోతామని కొంతమంది పురుషులు భయపడుతారు మరియు తమ సమాజం ఆశించే సాంప్రదాయ పాత్రలు మరియు ప్రవర్తనను తమ భార్యలు ఆచరించకపోవడం వారికి అసంతృప్తి కలిగిస్తుంది.

తన భార్య తనని విడిచిపెట్టవచ్చని లేదా ఇంటి నుండి దూరంగా పని చేస్తున్నప్పుడు వేరొక పురుషుడితో ఆమె సంబంధం పెట్టుకోవచ్చని కొన్నిసార్లు పురుషులు భయపడుతారు. అలాగే, పని పేరుతో మహిళలు గడపదాటి వెళ్లకూడదని, బయటి ప్రపంచం వాళ్లని నాశనం చేస్తుందని లేదా మహిళలు బయటి ప్రపంచంలో తమ స్థానం నిలబెట్టుకోలేరని కూడా కొందరు పురుషులు నమ్ముతారు.

ఒక మహిళ సొంతంగా డబ్బు సంపాదించడం ప్రారంభించినప్పుడు ఆమె తరచుగా తన కుటుంబం నుండి ఎక్కువ గౌరవం, ప్రభావం మరియు గుర్తింపు కోరుకుంటుంది. ఉదాహరణకు, కుటుంబంలో నిర్ణయం తీసుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించాలనుకోవచ్చు (ఉదాహరణకు, కుటుంబంలో డబ్బును దేనికోసం ఖర్చు చేయాలనే దాని గురించి). చాలామంది పురుషులు దీన్ని అస్సలు ఇష్టపడరు మరియు కుటుంబంలో తాము మాత్రమే తిరుగులేని అధిపతిగా ఉండడానికి ఇష్టపడతారు.

ఈ రకమైన పాత్ర సంఘర్షణ అనేది గణనీయ స్థాయిలో వైవాహిక అసమ్మతికి దారితీస్తుంది.

Sources
  • Audiopedia ID: tel021004