పిల్లల్లో గాయాల నిరోధం విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమేమిటి
ప్రతి సంవత్సరం, దాదాపు 1 మిలియన్ మంది పిల్లలు గాయాల కారణంగా మరణిస్తున్నారు. అలాగే, ప్రాణాంతక గాయాల కారణంగా పదిలక్షల మంది పిల్లలకి ఆసుపత్రిలో సంరక్షణ అవసరం. గాయాల కారణంగా, చాలామంది పిల్లలకు శాశ్వత వైకల్యం లేదా మెదడు దెబ్బతినడం జరుగుతోంది.
గాయాలనేవి అన్ని వయసుల పిల్లలనూ ప్రభావితం చేస్తాయి. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు అమ్మాయిలు మరియు అబ్బాయిలకు ఈ ప్రమాదం మరింత ఎక్కువ ఉంటుంది. బాలికల కంటే అబ్బాయిలే ఎక్కువగా గాయాలతో మరణిస్తుంటారు.
ట్రాఫిక్ గాయాలు, మునిగిపోవడం (నీటిలో మునిగిపోవడం), కాలిన గాయాలు, క్రింద పడడం మరియు విషం తాగేయడం లాంటివి ప్రమాదాలకు సర్వసాధారణ కారణాలుగా ఉంటున్నాయి.
ట్రాఫిక్ గాయాలు మరియు మునిగిపోవడం అనేవి గాయం సంబంధిత మరణాలకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి.
చిన్న పిల్లలు గాయపడే సర్వసాధారణ ప్రదేశాలు వారి ఇళ్లలో లేదా చుట్టుపక్కలే ఉంటాయి.
నిజానికి, దాదాపుగా ఈ గాయాలన్నీ నిరోధించగలిగినవే.
సురక్షిత వాతావరణంలో జీవించే పిల్లల హక్కును నిర్ధారించే మరియు గాయాల నుండి వాళ్లని రక్షించే బాధ్యత కుటుంబాలు, సమాజాలు మరియు ప్రభుత్వాల మీద ఉంది.