పిల్లల విషయంలో సాధారణంగా తలెత్తే సంఘర్షణలేమిటి
అనేక దేశాల్లో మహిళలకు వారి కుటుంబాల్లో గౌరవం దక్కదు. చాలా కుటుంబాల్లో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, బాలికల కంటే అబ్బాయిలనే ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే, వృద్ధాప్యంలో అబ్బాయిలే తమ తల్లిదండ్రులకు మద్దతుగా నిలుస్తారని భావిస్తారు. కాబట్టి, కుటుంబాలు తమ కుమార్తెలకు కాకుండా, కుమారులకే అందుబాటులోని అన్ని ఆరోగ్య సంరక్షణలు మరియు విద్య అందించే అవకాశం ఉంటోంది. అయితే, ప్రస్తుతం చాలామంది మహిళలు ఈ ఆచారాన్ని అంగీకరించడం లేదు. తమ కుమార్తెలకు సైతం మెరుగైన జీవితాలు కావాలని మహిళలు కోరుకుంటున్నారు. ఇందుకోసం, సంప్రదాయాలను సవాలు చేయడానికి మరియు అమ్మాయిలా, అబ్బాయిలా అనే దానితో సంబంధం లేకుండా తమ పిల్లలందరితో ఎలా వ్యవహరించాలి మరియు వాళ్లని ఎలా విద్యావంతులను చేయాలనే విషయమై భర్తతో చర్చించేందుకు మహిళలు సిద్ధంగా ఉంటున్నారు.
బాలికలు వారి కుటుంబాలకు మరియు సమాజానికి భారం అనే విస్తృతమైన నమ్మకం కారణంగా, ప్రపంచంలోని ప్రతిచోటా చట్టం ద్వారా నిషేధించబడినప్పటికీ, అనేక దేశాల్లో ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో గర్భంలోని శిశువు ఆడపిల్ల అని తెలిస్తే, గర్భస్రావం చేసుకోవాలని మరియు ఆడపిల్ల పుడితే ఆహారం మరియు ఆరోగ్య సంరక్షణ లాంటివి తిరస్కరించడం ద్వారా, ఆ ఆడపిల్ల చనిపోయేలా చేయాలని మహిళల మీద ఒత్తిడి తెస్తుంటారు. ఉదాహరణకు, భారతదేశంలో ఏటా సుమారు 7,50,000 మంది బాలికలకు గర్భస్రావాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆడపిల్లను కాపాడడం ఒక మహిళకు చాలా కష్టంగా ఉంటోంది.
అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మగపిల్లలు కనాలనే ఒత్తిడి మహిళల మీద భయానకంగా ఉంటోంది మరియు మగ పిల్లల్ని కనని మహిళలు తరచుగా దుర్వినియోగానికి (భర్తలు, అత్తమామలు లేదా ఇతర కుటుంబ సభ్యులు చేతిలో), హింసకు గురవుతున్నారు లేదా ఇంటి నుండి తరిమేయబడుతున్నారు. అలా కాని పక్షంలో, ఆ మహిళల్లో అపరాధ భావన కలిగించి, కుటుంబంలో వారి హోదాను మరింత దిగజార్చేస్తున్నారు.