పురుషుడిలో వంధ్యత్వానికి కారణం కాగల అంశాలేమిటి

From Audiopedia
Jump to: navigation, search

పురుషుడిలో వంధ్యత్వానికి ప్రధాన కారణాలు:

1. అతని తగినంత వీర్యం ఉత్పత్తి కాకపోవడం లేదా అతని వీర్య కణాలు స్త్రీ గొట్టాల్లోకి ఈదుకుంటూ వెళ్లి, అండాన్ని ఫలదీకరించే పరిస్థితి లేకపోవడం.

2. యుక్తవయస్సు తర్వాత అతనికి గవదబిళ్ళలు రావడం వల్ల అతని వృషణాలు దెబ్బతినడం. అతను స్ఖలించినప్పటికీ (స్ఖలనం జరిగినప్పటికీ), అందులో వీర్య కణాలు లేకపోవడం.

3. లైంగికంగా సంక్రమించిన ఇన్ఫెక్షన్ (STI) కారణంగా, అతని వీర్య నాళాల్లో సమస్య ఏర్పడి, వీర్యం అతని అంగం నుండి బయటకు రాలేకపోవడం.

4. అతని వృషణాల తిత్తిలోని సిరలకు వాపు (వెరికోసెల్) ఉండడం.

5. లైంగిక చర్య సమయంలో సమస్యలకు కారణాలు:

  • అతని అంగం గట్టిపడకపోవడం.
  • అతని అంగం గట్టిపడినప్పటికీ, లైంగిక చర్య ముగిసేవరకు అదే స్థితిలో ఉండకపోవడం.
  • అతని అంగం స్త్రీ యోనిలోకి లోతుగా వెళ్లకముందే స్ఖలించడం.

6. మధుమేహం, క్షయ మరియు మలేరియా లాంటి వ్యాధులు.

Sources
  • Audiopedia ID: tel011202