పురుషుడి కోసం కండోమ్‌ను ఎలా ఉపయోగించాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

1. ఆ వ్యక్తికి సున్తీ చేసి ఉండకపోతే, ముందరి చర్మం వెనక్కి నెట్టండి. కండోమ్ కొనను రెండు వేళ్లతో నొక్కండి మరియు గట్టిపడిన పురుషాంగం చివర్లో దానిని ఉంచండి.

2. కండోమ్‌ని పురుషాంగం మీదుగా విప్పదీస్తూ వెళ్లే సమయంలో, దాని కొన నొక్కిపెట్టుకునే ఉండండి. కండోమ్ కొనలో వదులుగా ఉన్న ఆ భాగంలోనే పురుషుడి వీర్యం వచ్చి చేరుతుంది. వీర్యం బయటకు వచ్చినప్పుడు, అది నిల్వ ఉండడానికి చోటు లేకపోతే, ఆ కండోమ్ చిరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

3. పురుషుడు స్ఖలనం చేసిన తర్వాత, అతని పురుషాంగం ఇంకా గట్టిగా ఉండగానే, పైభాగంలో కండోమ్ అంచు గట్టిగా పట్టుకుని, పురుషాంగాన్ని యోని నుండి బయటకు తీసేయాలి.

4. కండోమ్ తొలగించే సమయంలో వీర్యం చిందకుండా లేదా లీక్ కాకుండా నిరోధించండి.

5. కండోమ్‌ని మూడివేసి, పిల్లలు మరియు జంతువుల నుండి దూరంగా పారవేయండి.

లూబ్రికెంట్లు కండోమ్‌ని తడిగా మరియు జారుడుగా చేస్తాయి. తద్వారా, కండోమ్ చిరిగిపోకుండా ఉండడంలో సహాయపడతాయి మరియు సురక్షితంగా ఉండేలా చేసి, మరింత ఆనందం అందిస్తాయి. లూబ్రికెంట్‌లనేవి ఉమ్మి (లాలాజలం) లేదా కె-వై జెల్లీ లాంటి వాటర్-బేస్డ్‌గా ఉండాలి. గట్టిపడిన పురుషాంగానికి కండోమ్ తొడిగిన తర్వాత, ఆ కండోమ్ మీద ఈ లూబ్రికెంట్ రుద్దండి. కండోమ్ కొన లోపల ఒక చుక్క లూబ్రికెంట్ వేయడం కూడా పురుషుడుకి మంచి అనుభూతి అందిస్తుంది. వంట నూనెలు, బేబీ ఆయిల్, మినరల్ ఆయిల్, పెట్రోలియం జెల్, స్కిన్ లోషన్ లేదా వెన్న లాంటివి ఉపయోగించకండి. వీటివల్ల కండోమ్‌ సులభంగా చిరిగిపోగలదు.

Sources
  • Audiopedia ID: tel020410