పురుషులు తమను హింసించినప్పటికీ మహిళలు వాళ్లతో కలసి ఉండడానికి కారణమేమిటి
ఒక మహిళ మీద పురుషుడు హింసకు పాల్పడిన విషయం తెలిసినప్పుడు, అంత జరిగిన తర్వాత కూడా \"ఆమె ఎందుకు అతనితో కలసి ఉంటోంది? అనే ప్రశ్న మొదటగా వినిపిస్తుంటుంది. అయితే, దుర్వినియోగానికి పాల్పడే పురుషుడితో ఒక మహిళ కలిసి ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో కొన్ని:
నువ్వు నన్ను వదలి వెళ్లావంటే, \"నేను నిన్ను చంపుతాను, పిల్లలను చంపుతాను, నీ తల్లిని చంపుతాను అని ఆ పురుషుడు ఆమెని బెదిరించి ఉంటాడు. తనను మరియు ఇతరులను రక్షించుకోవడానికి అతడితో కలసి ఉండడం తప్ప చేయగలిగిందేమీ లేదని ఆమె భావించి ఉండవచ్చు.
అయితే, అంత జరిగిన తర్వాత కూడా \"అతను ఎందుకు వదలి వెళ్లడు? అనే ప్రశ్న మన నుండి రావడమే కరెక్టు. \"ఆమె ఎందుకు వదలి వెళ్లదు అని మనం ప్రశ్నించామంటే, అది ఆమె వ్యక్తిగత సమస్య అని, దానిని ఆమె మాత్రమే పరిష్కరించుకోవాలని మనం భావిస్తున్నట్టు అర్థం. అయితే, హింస అనేది ఆమె సమస్య మాత్రమే అని ఆలోచించడమే తప్పు.
ఒక సమాజంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా మరియు శ్రేయస్సుతో ఉండేందుకు ఆ మొత్తం సమాజం బాధ్యత వహించాలి.
శారీరక హాని లేకుండా జీవించే ఒక స్త్రీ హక్కును ఉల్లంఘించడం లేదా ఆమెను చంపేసే నేరానికి ఒక పురుషుడు పాల్పడకుండ అతడిని అడ్డుకునే మరియు ఆపే పరిస్థితి తప్పక ఉండాలి.