పురుషుల కండోమ్‌లు గురించి నేనేం ఏమి తెలుసుకోవాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

పురుషుల కండోమ్ అనేది సెక్స్ సమయంలో పురుషుడు తన పురుషాంగానికి ధరించే పలుచటి రబ్బరుతో చేసిన ఒక తిత్తి లాంటిది. పురుషుడి వీర్యం ఈ తిత్తీలో ఆగిపోతుంది కాబట్ట, అది స్త్రీ శరీరంలోకి ప్రవేశించదు.

కండోమ్‌లు గర్భం నుండి మంచి రక్షణ అందిస్తాయి. స్పెర్మిసైడ్లు మరియు నీటి ఆధారిత కందెనతో ఉపయోగించినప్పుడు ఇవి చాలా ప్రభావవంతంగా ఉంటాయి.

కండోమ్‌ల వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

STIలు మరియు HIV నుండి కండోమ్‌లు ఉత్తమ రక్షణ అందిస్తాయి. వీటిని ఒంటరిగా లేదా ఏదైనా ఇతర కుటుంబ నియంత్రణ పద్ధతితో పాటుగా ఉపయోగించవచ్చు. కండోమ్‌లను అనేక మందుల దుకాణాలు మరియు మార్కెట్లలో కొనుగోలు చేయవచ్చు, మరియు తరచుగా ఆరోగ్య కేంద్రాలలో మరియు ఎయిడ్స్ నివారణ కార్యక్రమాల ద్వారా కూడా ఇవి అందుబాటులో ఉంటాయి.

  • పురుషాంగం గట్టిపడిన స్థితిలో ఉండి, స్త్రీ యోనిలోకి చొప్పించడానికి ముందే కండోమ్ ధరించాలి. అంగం గట్టిపడిన స్థితిలో కండోమ్ ధరించకుడా, స్త్రీ యోని మీద రుద్దితే లేదా యోని లోపలకు వెళ్తే, పురుషుడు స్ఖలించనప్పటికీ, స్త్రీ గర్భవతి అయ్యే అవకాశం లేదా ఆమెకు STI సోకే అవకాశం ఉంటుంది.
  • కండోమ్ చిరిగిపోతే లేదా పురుషాంగం నుండి ఊడిపోతే, స్త్రీ వెంటనే యోనిలోకి వీర్య నిరోధకం చొప్పించాలి. వీలైతే, అత్యవసర కుటుంబ నియంత్రణ ఉపయోగించండి.

గుర్తుంచుకోండి:

  • మీరు లైంగిక చర్యకు సిద్ధమైన ప్రతిసారి కండోమ్ ఉపయోగించండి.
  • స్త్రీ వేరొక కుటుంబ నియంత్రణ పద్ధతి పాటిస్తున్నప్పటికీ, ఆమెకి STI నుండి రక్షణ అవసరమైతే, కండోమ్ కూడా ఉపయోగించాలి.
  • వీలైతే, రబ్బరుతో తయారైన కండోమ్‌లనే ఎల్లప్పుడూ ఉపయోగించండి. HIV నుండి ఉత్తమ రక్షణ అందిస్తాయి. గొర్రె చర్మం లేదా మేక చర్మంతో తయారైన కండోమ్‌లు HIV నుండి రక్షించలేకపోవచ్చు.
  • కండోమ్‌లను సూర్యరశ్మి నుండి దూరంగా ఉండేలా చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. పాత లేదా చిరిగిన ప్యాకేజీల్లోని కండోమ్‌లు చిరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • కండోమ్‌ని ఒకసారి మాత్రమే ఉపయోగించండి. ఒకసారి ఉపయోగించిన కండోమ్‌ని మరోసారి ఉపయోగిస్తే, అది చిరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • కండోమ్‌లు అందుబాటులో ఉంచుకోండి. వాటిని వెతకడం కోసం మీరు చేస్తున్న పనిని మధ్యలో ఆపాల్సి వస్తే, మీరు వాటిని ఉపయోగించే అవకాశం తక్కువగా ఉంటుంది.
  • మొదట్లో, కండోమ్‌లు ఉపయోగించడానికి చాలా జంటలు ఇష్టపడవు. కానీ, ఒకసారి వారు దానికి అలవాటు పడితే, అవాంఛిత గర్భాలు మరియు STI నుండి రక్షణతో పాటు వాటివల్ల ప్రయోజనాలను కూడా వాళ్లు గుర్తించవచ్చు. ఉదాహరణకు, కండోమ్ ధరించినప్పుడు కొందరు పురుషులు స్ఖలించడానికి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల, వాళ్ల పురుషాంగం ఎక్కువసేపు గట్టిగా ఉండడంలో ఇవి సహాయపడుతాయి.
  • మీరు ప్యాకేజీ తెరిచే సమయంలో కండోమ్ చిరిగిపోకుండా జాగ్రత్త వహించండి. ప్యాకేజీ చిరిగిపోతే లేదా ఎండిపోయినట్లుగా ఉంటే లేదా కండోమ్ గట్టిగా లేదా జిగటగా ఉంటే దానిని ఉపయోగించకండి. ఆ కండోమ్ వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే, కండోమ్ వేసుకోవడానికి ముందే దానిని విప్పదీయకండి.
Sources
  • Audiopedia ID: tel020409