పురుషుల హింస కారణంగా, మహిళల్లో ఈ పరిస్థితులు తలెత్తవచ్చు:
ప్రేరణ లేకపోవడం లేదా స్వీయ-విలువ భావన లేకపోవడం.
ఆందోళన మరియు తినడం, నిద్రపోవడం లాంటి విషయాల్లో మానసిక ఆరోగ్య సమస్యలు. హింసను ఎదుర్కోవడానికి ఒక మార్గంగా, హానికర లేదా నిర్లక్ష్య ప్రవర్తనను మహిళలు ప్రారంభించవచ్చు. అంటే, మాదకద్రవ్యాలు లేదా మద్యయం తీసుకోవడం లేదా చాలామంది భాగస్వాములను కలిగి ఉండడం లాంటివి చేయవచ్చు.
తీవ్రమైన నొప్పి మరియు గాయాలు: ఎముకలు విరిగిపోవడం, కాలిన గాయాలు, నల్లటి కళ్లు, కోతలు, గాయాలు, తలనొప్పి, కడుపు నొప్పి, కండరాల నొప్పులు లాంటివి దుర్వినియోగం జరిగిన తర్వాత చాలా సంవత్సరాలు కొనసాగవచ్చు.
లైంగికపరమైన ఆరోగ్య సమస్యలు. గర్భధారణ సమయంలో పురుషుడు కొట్టడం వల్ల చాలామంది మహిళలు గర్భస్రావాలకు గురవుతారు. అవాంఛిత గర్భాలు, సాంక్రమిక అంటువ్యాధులు (STIలు) లేదా దుర్వినియోగం ఫలితంగా వాళ్లు HIV బారిన కూడా పడవచ్చు. లైంగిక దుర్వినియోగం కారణంగా, తరచుగా మహిళలు సెక్స్ అంటే భయం, కలయిక సమయంలో నొప్పి మరియు కోరిక లేకపోవడానికి గురవుతారు.