పెద్ద వయసు వ్యక్తుల విషయంలో నేను ప్రత్యేకించి ఎందుకు జాగ్రత్తగా ఉండాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

కొంతమంది అమ్మాయిలు పెద్ద వయసు వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతుంటారు. ఆ పెద్ద వయసు వ్యక్తి మీ సమాజంలో బాగా తెలిసిన లేదా ప్రముఖ వ్యక్తిగా ఉన్నప్పుడు లేదా అతను డబ్బు గలవాడై, మీరు అడిగే వాటిని కొనిపెట్టే పరిస్థితి ఉన్నప్పుడు అతనితో వెళ్లడం ఉత్తేజకరంగా అనిపించవచ్చు. తన ప్రియురాలి కోసం అనేక బహుమతులు కొనే వ్యక్తిని కొన్ని ప్రదేశాల్లో 'షుగర్ డాడీ' అని పిలుస్తారు.

అప్పటికే పెళ్లైన లేదా ఇతర మహిళలతో సంబంధాలు ఉన్న ఆ పెద్ద వయసు వ్యక్తితో వెళ్లిన అమ్మాయికి తనను అతను సెక్స్ కోసం వాడుకున్నాడని లేదా తనతో అసభ్యంగా వ్యవహరించాడనే పరిస్థితి తరచుగా ఎదురవుతుంటుంది.

ఒక అమ్మాయి మీద పెద్ద వయసు వ్యక్తికి అధికారం ఉన్నప్పుడు, ఆమె సహచర వయసు అబ్బాయిల కంటే ఆ ఆ పెద్ద వయసు వ్యక్తే సెక్స్ కోసం ఆ అమ్మాయి మీద ఎక్కువ ఒత్తిడి చేయవచ్చు.

అనేక సమాజాల్లో, ఇతర వయసు సమూహాల కంటే ఎక్కువ మంది యువతులు మరియు బాలికలే HIV బారిన పడుతున్నారు. పెద్ద వయసు వ్యక్తులతో సెక్స్ సంబంధం కలిగిన అమ్మాయిలకి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే, పెద్ద వయసు వ్యక్తులు సాధారణంగా HIV బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, ఒక పురుషుడికి ఏ వయసులోనైనా ఆ పరిస్థితి ఎదురుకాగలదు.

Sources
  • Audiopedia ID: tel020816