పొగను తగ్గించే హేబాక్స్ కుక్కర్‌ని నేనఎలా తయారు చేయగలను
ఎక్కువ ఇంధనం ఆదా చేయడానికి, ఆహారం వెచ్చగా ఉంచడానికి లేదా పొయ్యి మీద మరిగిన తర్వాత, ఆహారాన్ని వెచ్చగా లేదా సిమ్మర్‌లో ఉంచడానికి హేబాక్స్ కుక్కర్ ఉపయోగించవచ్చు. ఈ కుక్కర్‌లో బీన్స్, మాంసం, బియ్యం లేదా ధాన్యాలు వండడం ద్వారా, ఇంధన వినియోగం సగానికి పైగా తగ్గించవచ్చు. ఈ కుక్కర్‌లో నీళ్లు ఎక్కువగా ఆవిరి కాదు కాబట్టి, బియ్యం మరియు ధాన్యాలు 1⁄3 వంతు తక్కువ నీళ్లు తీసుకుంటాయి.
4 అంగుళాల ఎండుగడ్డి (లేదా గడ్డి, రంపపు పొట్టు, పాత దుస్తులు, ఈకలు, పొట్టు, పత్తి, ఉన్ని, స్టైరోఫోమ్ లేదా ముడతలు పెట్టిన కార్డ్‌బోర్డ్)తో కార్డ్‌బోర్డ్ పెట్టె సిద్ధం చేయడం ద్వారా హే బాక్స్ తయారు చేయండి. మీ వంట పాత్ర కోసం మరియు పాత్ర పైన మరింత ఇన్సులేషన్ కోసం బాక్స్ లోపల స్థలం వదిలేయండి. పెట్టె మూత గట్టిగా సరిపోయేలా ఉండాలి. హేబాక్స్ కుక్కర్ ఉపయోగిస్తున్నప్పుడు, ఈ విషయాలు గుర్తుంచుకోండి:
హే కుక్కర్‌ని బయటి మంట నుండి దూరంగా ఉంచండి.