పొగ కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలను నేనెలా నిరోధించగలను
మీరు పొగ గాలి పీల్చడం తగ్గించడానికి:
గాలి ధారాళంగా వచ్చే చోట వంట చేయండి. మీరు ఆరుబయట వంట చేయలేకపోతే, వంట చేసే గదిలో గాలి వచ్చి, వెళ్లడం కోసం కనీసం 2 ద్వారాలు ఉన్నాయని నిర్ధారించుకోండి. తద్వారా, గదిలో పొగ కమ్మేయకుండా, గది నుండి పొగ బయటకు వెళ్తుంది.
మహిళలు విడతలు వారీగా వంట చేయడం వల్ల, ప్రతి మహిళ తక్కువగా పొగ పీలుస్తుంది.
తక్కువ సమయంలో వంట పూర్తయ్యే (అయినప్పటికీ, ఆహారం పూర్తి స్థాయిలో ఉడికే) ఆహార పదార్థాలను గుర్తించండి. తద్వారా, మీరు తక్కువ పొగ మాత్రమే పీల్చుకుంటారు మరియు మీకు ఇంధనం ఖర్చు కూడా తగ్గుతుంది.
మీరు ఇలా చేయడం వల్ల ఆహారం త్వరగా మరియు పూర్తి స్థాయిలో ఉడుకుతుంది:
తక్కువ పొగ ఉత్పత్తి చేసే పొయ్యి ఉపయోగించండి. వంట పొగ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు నివారించడానికి ఇదే ఉత్తమ మార్గం. తక్కువ ఇంధనం కాల్చే మరియు చాలా తక్కువ పొగ ఉత్పత్తి చేసే పొయ్యిలు మీ ప్రాంతంలోనే అందుబాటులో ఉండవచ్చు. అలాగే, మీరు వాటిని స్థానిక వస్తువులతో కూడా తయారు చేయవచ్చు.