పొగ తక్కువగా వచ్చే రాకెట్ పొయ్యిని నేనెలా తయారు చేయగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

సులభంగా తయారు చేయగల పొయ్యికి ఇదొక ఉదాహరణ. మీరు ఉపయోగించే ఇంధనం మరియు మీ ప్రాంతంలో అందుబాటులో ఉండే మెటీరియల్‌ల కోసం ఈ పొయ్యి మీకు అనువుగా ఉంటుంది.

మీకు కావలసినవి:

  • వంట నూనె డబ్బా, సోయా సాస్ డబ్బా, పెద్ద పెయింట్ డబ్బా (బాగా శుభ్రం చేసినది) లేదా వైద్య సామాగ్రి ప్యాక్ చేసే డబ్బా లాంటి పెద్ద (5 గాలన్ల పరిమాణం) డబ్బా ఒకటి కావాలి. పొయ్యి కోసం సిండర్‌బ్లాక్‌లు లేదా ఇటుకలు కూడా ఉపయోగించవచ్చు. అయితే, పెద్ద డబ్బా పలుచగా ఉంటుంది మరియు ఎక్కువ వేడిని గ్రహించదు కాబట్టి అదే మంచిది.
  • 90-డిగ్రీల బెండ్ (మోచేయి లాగ్)తో, 4-అంగుళాల వెడల్పు గల మెటల్ స్టవ్ పైపు ఒకటి కావాలి. బెండ్‌కి ఒక వైపు పైపు మరొక వైపు పైపు కంటే పొడవుగా ఉండాలి. బెండ్‌లో పొట్టిగా ఉన్న చివరను అటాచ్ చేయడానికి మీకు స్ట్రెయిట్ స్టవ్ పైపు కూడా కావాలి. మీ స్టవ్‌లో బర్నింగ్ ఛాంబర్ మరియు చిమ్నీ రూపొందించడానికి ఈ పైపులు ఉపయోగించబడతాయి (4 లేదా 5 టిన్ డబ్బాలు తీసుకుని వాటి పైన మరియు క్రింద కట్ చేసి, స్టవ్ పైపులకు బదులుగా ఉపయోగించవచ్చు.)
  • ఇన్సులేషన్ కోసం కలప బూడిద, ప్యూమిస్ రాక్, వర్మిక్యులైట్, మృత పగడాలు లేదా అల్యూమినియం రేకు.
  • టిన్ స్నిప్‌లు మరియు రేకు కత్తిరించడానికి ఒక క్యాన్ ఓపెనర్.
  • పాత్ర చుట్టూ 'మరుగు' సృష్టించడానికి అదనపు మెటల్.
  • పొయ్యి పైభాగానికి గ్రేటింగ్ లేదా మందపాటి ఫెన్సింగ్ కావాలి. ఇక్కడే వంట పాత్ర ఉంటుంది.

స్టవ్‌ ఎలా తయారు చేయాలి:

పెద్ద డబ్బాకి ఉండే మూత తీయడానికి క్యాన్ ఓపెనర్ లేదా టిన్ స్నిప్‌లు ఉపయోగించండి. చిమ్నీ కోసం మూత మధ్యలో 4-అంగుళాల గుండ్రటి రంధ్రం కత్తిరించండి. బర్నింగ్ ఛాంబర్ కోసం డబ్బా దిగువన 1 అంగుళం పైకి ఉండేలా, డబ్బా క్రింద ముందు భాగంలో మరో 4-అంగుళాల గుండ్రని రంధ్రం కత్తిరించండి. మీరు కత్తిరించిన ఈ రంధ్రాలు మీ స్టవ్ పైపు లేదా టిన్ క్యాన్ల చుట్టూ సరిపోవాలి.

డబ్బా లోపల బెండ్ స్టవ్ పైపు ఉంచండి. తద్వారా, డబ్బాలోని ఒక చివర నుండి అది బయటకు వస్తుంది. పైప్‌లోని పొడవాటి చివరలో 2 సమాంతర కట్‌లు ½ అంగుళంతో వేరు చేసి, పెదవి లాంటి భాగం చేయడానికి ఆ భాగం వెనుకకు వంచండి. తద్వారా, పైపు డబ్బాలోకి జారిపోదు. పైపులోని పొడవైన భాగం బర్నింగ్ ఛాంబర్ (ఇంధనం కాలే ప్రదేశం)గా ఉంటుంది. డబ్బా పైభాగంలో 1 అంగుళం క్రింద ముగిసే చిమ్నీని తయారు చేయడానికి బెండ్‌లోని చిన్న పైపు చివర పైపు సరళమైన భాగం అటాచ్ చేయండి. ఈ పైపు మీద కూడా పెదవి లాగా వంచండి. తద్వారా, పైపు పైభాగం డబ్బాలోకి జారిపోకుండా ఉంటుంది.

గమనిక: టిన్ డబ్బాల నుండి తయారు చేసిన చిమ్నీ 1 నుండి 3 నెలల వరకు మాత్రమే ఉంటుంది, అటుపై మీరు దానిని మళ్లీ తయారు చేయాలి. ఈ పరిస్థితి నివారించడం కోసం 3 భాగాల ఇసుక మరియు 2 భాగాల మట్టి మిశ్రమంతో చేసి, కాల్చిన మట్టి చిమ్నీ తయారు చేయండి. టిన్ డబ్బాల చిమ్నీ చుట్టూ ఈ మట్టి పూయండి. డబ్బాలు కాలిపోయినప్పటికీ, మీరు దాని చుట్టూ ప్యాక్ చేసిన అన్ని ఇన్సులేషన్ ద్వారా మద్దతు ఇచ్చే మట్టి చిమ్నీ అలాగే ఉంటుంది.

పొయ్యి చుట్టూ, చిమ్నీ చుట్టూ కలప బూడిద లాంటి ఇన్సులేషన్ నింపండి.

ఇన్సులేషన్ మీద మరియు చిమ్నీ చుట్టూ క్యాన్ మూత పెట్టండి.

బర్నింగ్ ఛాంబర్ లోపల షెల్ఫ్ చేయడానికి టిన్ డబ్బా ఉపయోగించండి. డబ్బా చివరలు తీసివేసి, చదునుగా చేయండి. తర్వాత, పైపు లోపల సరిపోయే విధంగా, T ఆకారంలో దానిని కత్తిరించండి. T లోని పైభాగం బయటకు ఉంటుంది మరియు షెల్ఫ్ లోపలికి జారిపోకుండా ఉంచుతుంది. కొమ్మలు కాలిపోతున్నప్పుడు వాటికి మద్దతుగా షెల్ఫ్ వెలుపలి భాగం కింద ఒక ఇటుక లేదా రాయిని ఉంచండి.

స్టవ్ పైభాగంలో పాత్ర ఉంచడానికి మీ గ్రేటింగ్ లేదా ఫెన్సింగ్ ఉపయోగించండి.

అదనపు మెటల్‌తో స్కర్ట్ ఏర్పాటు చేయండి. అది పాత్ర చుట్టూ ఉండాలి. స్కర్ట్ మరియు కుండ మధ్య బేస్ వద్ద ¼ అంగుళాల ఖాళీ వదలాలి. మరింత మెరుగైన స్కర్ట్ కోసం, డబుల్ స్కర్ట్ తయారు చేయండి మరియు 2 మెటల్ షీట్ల మధ్య ఇన్సులేషన్ ఉంచండి.

మీరు ఇంటి లోపల వండాలనుకుంటే, స్టవ్‌ను గోడ దగ్గర్లో ఖాళీ ప్రదేశంలో ఉంచండి. పొగ గోడ వెంట వెళ్లి, ఇంటి నుండి బయటకు వెళ్లిపోతుంది.

Sources
  • Audiopedia ID: tel030104