పోషకాహార లోపం కారణంగా నా పిల్లల్లో రాగల ఆరోగ్య మరియు పెరుగుదల సమస్యలను నేనెలా నిరోధించాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

మీ చిన్నారి తరచుగా తగినంతగా తింటున్నారని నిర్ధారించుకోండి. తల్లిపాలు ఇవ్వడంతో పాటు 6 నుండి 8 నెలల వయస్సు గల చిన్నారికి రోజుకు రెండు నుండి మూడు సార్లు మరియు 9 నెలల నుండి రోజుకు మూడు నుండి నాలుగు సార్లు ఏదైనా తినిపించాలి. పండ్ల ముక్క లేదా గింజల పేస్ట్‌తో కూడిన రొట్టె లాంటి అదనపు పోషక స్నాక్స్ రోజుకు ఒకటి లేదా రెండు సార్లు అవసరం కావచ్చు. అభివృద్ధిలో జాప్యాలు లేదా వైకల్యాలతో ఉన్న చిన్నారికి తినిపించడానికి అదనపు సహాయం మరియు సమయం అవసరం కావచ్చు.

శిశువుకు తగినంత ఆహారం లభిస్తోందని నిర్ధారించుకోండి. 6 నుండి 8 నెలల వయస్సు గల చిన్నారి ప్రారంభంలో 2 నుండి 3 చెంచాల ఆహారం అందుకోవాలి. క్రమంగా ప్రతి భోజనంలో సగం కప్పు (250-మిల్లీ లీటర్లు) వరకు పెంచాలి. 9 నుండి 12 నెలల వయస్సు గల పిల్లలకి ప్రతి భోజనం ఒకటిన్నర కప్పు వరకు ఇవ్వాలి. 12 నుండి 23 నెలల వయస్సు గల పిల్లలకు ప్రతి భోజనంలో ఇంట్లో వండే ఆహారపదార్థాలు ముప్పావు నుండి ఒక కప్పు వరకు అవసరం. 2 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు పిల్లలకు ప్రతి భోజనంలో కనీసం 1 పూర్తి కప్పు ఆహారం ఇవ్వాలి. చిన్నారి ఆ ఆహారం తినేసి, ఇంకా ఎక్కువ కోరుకుంటే, ఆ బిడ్డ అవసరం మేరకు ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలకి ఒక నిర్దిష్ట ఆహారం రుచి నచ్చకపోతే, ఇతర ఆహారాలు అందించాలి. క్రొత్త ఆహారాలను క్రమంగా పరిచయం చేయాలి.

పిల్లల భోజనంలో 'పెరుగుదల' లేదా 'శక్తి' అందించే ఆహారాలు తగిన మొత్తంలో ఉన్నాయని నిర్ధారించుకోండి. బీన్స్, కాయలు, మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, ధాన్యాలు మరియు పప్పుధాన్యాలు లాంటి ఆహారాలు పిల్లలు ఎదగడానికి సహాయపడుతాయి. ఆహారంలో జంతు-సంబంధిత ఆహారాలను రోజువారీగా చేర్చడం చాలా ముఖ్యం. చిన్న మొత్తంలో నూనె శక్తిని జోడించగలదు. ఎర్ర తాటి నూనె లేదా ఇతర విటమిన్ సమృద్ధిగా ఉండే తినదగిన నూనెలు మంచి శక్తి వనరులుగా ఉంటాయి. పిల్లలు తగినంత బరువు మరియు ఎత్తు రెండింటినీ చేరుకునేలా చూడటానికి అధిక-నాణ్యత గల 'పెరుగుదల' ఆహారాలు చాలా ముఖ్యమైనవి. అధిక ప్రాసెస్ చేసిన కొవ్వు పదార్థాలు లేదా చక్కెర స్నాక్స్ లాంటి ఆహారాల్లో విటమిన్లు మరియు ఖనిజాలు మరియు ఇతర ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉండవు మరియు పిల్లలు వారి ఎత్తుకి మరియు బరువుకి సంబంధం లేకుండా అధికంగా బరువు పెరగడానికి కారణం కావచ్చు.

అనారోగ్యంతో ఉన్న పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. అనారోగ్యంతో ఉన్న చిన్నారి తక్కువ మొత్తంలో, తరచుగా భోజనం తినేలా ప్రోత్సాహం అవసరం. బిడ్డకు తరచుగా తల్లిపాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అనారోగ్యం తర్వాత, కోల్పోయిన బరువును తిరిగి పొందడానికి మరియు శక్తి మరియు పోషణను తిరిగి పొందడానికి చిన్నారి సాధారణం కంటే ఎక్కువ తినాలి. చిన్నారి తరచుగా అనారోగ్యంతో ఉంటే, అతన్ని లేదా ఆమెను శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త ద్వారా పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలి.

శిశువుకు తగినంత విటమిన్-ఏ ఉన్న ఆహారాలు లభిస్తున్నాయని నిర్ధారించుకోండి. తల్లి పాలలో విటమిన్-ఏ సమృద్ధిగా ఉంటుంది. కాలేయం, గుడ్లు, పాల ఉత్పత్తులు, ఎర్ర తాటి నూనె, పసుపు మరియు నారింజ పండ్లు మరియు కూరగాయలు మరియు ఆకుపచ్చ ఆకు కూరలు లాంటి ఇతర ఆహారాల్లోనూ విటమిన్-ఏ ఉంటుంది. ఈ ఆహారాలు తగినంత పరిమాణంలో అందుబాటులో లేకపోతే, ఆరోగ్య సంరక్షణ ప్రదాత ద్వారా ప్రతి నాలుగు నుండి ఆరు నెలలకు ఒకసారి పిల్లలకు విటమిన్-ఏ సప్లిమెంట్ (మాత్ర లేదా సిరప్) అందించవచ్చు.

తల్లిపాలతో పాటు ప్రత్యామ్నాయ ఆహారం ఇస్తుంటే, దానిని సీసాతో కాకుండా శుభ్రమైన, కప్పు నుండి తినిపించాలి.

ఆహారం శుభ్రంగా ఉండేలా చూసుకోండి. లేకపోతే, చిన్నారికి తరచుగా అనారోగ్యం వస్తుంది. ముడి ఆహారాన్ని సురక్షితమైన మూలం నుండి తెచ్చిన శుభ్రమైన నీటితో కడగాలి లేదా వండాలి. వండిన ఆహారాన్ని ఆలస్యం చేయకుండా తినిపించాలి. మిగిలిపోయిన ఆహారాన్ని జాగ్రత్తగా నిల్వ చేసి, పూర్తిగా వేడి చేశాకే తినాలి.

పిల్లల ఆరోగ్యానికి స్వచ్ఛమైన నీరు చాలా అవసరం. నీరు సురక్షితమైన మూలం నుండి తీసుకొచ్చి, లోపల మరియు వెలుపల శుభ్రంగా ఉండే మూతలు కలిగిన కంటైనర్లలో నిల్వ చేయడం ద్వారా శుభ్రంగా ఉంచాలి. క్రమం తప్పకుండా నిర్వహించబడే, నియంత్రిత మరియు క్లోరినేటెడ్ పైపుల ద్వారా సరఫరా అయ్యే, వీధి కొళాయి, బోరుబావి, రక్షిత బావి, రక్షిత నీటి బుగ్గ లేదా వర్షపు నీటి సేకరణ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు తెచ్చుకోవాలి. చెరువులు, ప్రవాహాలు, అసురక్షిత నీటి బుగ్గలు, బావులు లేదా చెరువుల నుండి నీళ్లు తీసుకొస్తే, దానిని శుద్ధి చేయాలి. శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త లేదా ఎక్స్‌టెన్షన్ ఏజెంట్ అందించిన సమాచారానికి అనుగుణంగా ఆ నీటిని వేడి చేయడం, వడబోయడం, క్లోరిన్ ఉపయోగించడం లేదా సూర్యరశ్మితో క్రిమిసంహారకం చేయడం లాంటి ఇంటి నీటి చికిత్సలు ఉపయోగించవచ్చు.

మల విసర్జన మరుగుదొడ్డి లేదా టాయిలెట్‌లోనే చేశారని లేదా దానిని పూడ్చి పెట్టారని నిర్ధారించుకోండి. లెట్రిన్ లేదా టాయిలెట్ ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బు మరియు నీటితో కడుక్కుంటున్నారా లేదా బూడిద మరియు నీళ్లు లాంటి ప్రత్యామ్నాయంతో కడుక్కుంటున్నారా? అలా కాకపోతే, చిన్నారికి తరచుగా పురుగులు పడం మరియు ఇతర వ్యాధులు రావచ్చు. పురుగులు ఉన్న పిల్లవాడికి శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త నుండి పురుగుల తొలగింపు ఔషధం అవసరం.

చిన్నారి ఎక్కువ సమయం ఒంటరిగా లేదా పెద్ద పిల్లల సంరక్షణలో ఉంటే, ఆ చిన్నారికి ప్రత్యేకించి భోజన సమయంలో, పెద్దల నుండి ఎక్కువ శ్రద్ధ మరియు పరస్పర చర్య అవసరం కావచ్చు.

Sources
  • Audiopedia ID: tel010423