ప్రియమైన వారి ఆత్మహత్య తర్వాత నన్ను నేను ఎందుకు నిందించుకోకూడదు
ఆత్మహత్య కారణంగా మీ ప్రియమైన వ్యక్తిని కోల్పోయినప్పుడు ఏర్పడే లోతైన బాధ మీలో అనేక ప్రశ్నలు మరియు సందేహాలు తీసుకొస్తుంది.
మీరు దోషి కాదని తెలుసుకోండి. అది మీ తప్పు కాదని గుర్తుంచుకోండి. అలాంటి ఒక నిర్ణయం మీ ప్రియమైన వ్యక్తి తీసుకున్నారే తప్ప, అందులో మీ ప్రమేయం లేదు.
అపరాధ భావం అవసరం లేదు. అతను/ఆమె ఆత్మహత్య చేసుకుంటారని మీకు తెలిస్తే, దానిని ఆపడానికి మీరు చేయగలిగినదంతా చేసేవారు.
ఆ సమయంలో మీకు తెలిసిన మేరకు మీరు ఎంత ఉత్తమంగా చేయగలరో ఆ మేరకు చేశారని అంగీకరించండి. చనిపోయిన వ్యక్తి వారి ఆందోళనలు గురించి చెప్పినప్పుడు మీరు వాటిని తీవ్రంగా పరిగణించి ఉండకపోతే, మనుష్యులందరూ తప్పులు చేస్తారని అర్థం చేసుకోండి. మీరు కూడా మనిషే కాబట్టి, అది ఉద్దేశపూర్వకంగా జరగలేదని గ్రహించండి.
గుర్తుంచుకోండి: దుఃఖం లేదా అపరాధభావం కారణంగా మీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే, అలాంటి భావన సర్వసాధారణం అని, అది అర్థం చేసుకోగలిగిన పరిస్థితే అని గ్రహించండి. మీ ఆత్మహత్య ఆలోచనలు తీవ్రంగా ఉంటే, వెంటనే వృత్తిగత నిపుణుల సహాయం కోసం సంప్రదించండి.