ప్రియమైన వారి ఆత్మహత్య తర్వాత నన్ను నేను ఎందుకు రక్షించుకోవాలి
దురదృష్టవశాత్తూ, చాలామందికి ఆత్మహత్య గురించి పెద్దగా తెలియదు, దాని గురించి మాట్లాడటానికి కూడా వాళ్లు సంకోచిస్తారు. మరికొందరు అసంబద్ధంగా వ్యవహరించవచ్చు లేదా ఉద్దేశపూర్వకంగా హాని కలిగించే లేదా క్రూరమైన ప్రకటనలు చేయవచ్చు. అవి: \"మీ సోదరికి పిచ్చి కాబట్టి ఆత్మహత్య చేసుకుంది\". అనేక దేశాల్లో, ఆత్మహత్యతో ముడిపడిన ఒక కళంకంగా ఇప్పటికీ చాలా బలంగా ఉంది. కాబట్టి, ఆ పరిస్థితి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం.
ఆత్మహత్య గురించి మీరు ఎవరికైనా చెప్పేటప్పుడు జాగ్రత్త వహించండి. మీరు నిస్సందేహంగా భావించే, మీరు విశ్వసించే కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు వద్ద ఆత్మహత్య గురించి ప్రస్తావించినప్పుడు వాళ్లు మీ మనసు అర్థం చేసుకోగలరు. అయితే, పుకార్ల ద్వారా ఆ ఆత్మహత్య గురించి తెలుసుకుని, మీ ప్రియమైన వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ఆ విషయం మాట్లాడడం మీకు ఇష్టం లేకపోతే, \"దాని గురించి మాట్లాడడం నాకిష్టం లేదు\" అని మీరు చెప్పవచ్చు లేదా వారిని మర్యాదగా తిప్పికొట్టేలా విషయం చెప్పవచ్చు. మీకు సౌకర్యంగా లేని దాని గురించి మాట్లాడేలా మీపై ఒత్తిడి తేవడానికి ఎవరినీ అనుమతించకండి.
ఆ పరిస్థితి నుండి బయటపడడానికి మీకు మీరు సమయం ఇవ్వండి. మీకు సమస్యలు కలిగించే ఎవరినుండైనా లేదా దేని నుండైనా దూరంగా ఉండండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులకు, ప్రదేశాలకు దూరంగా ఉండండి. ఎవరైనా ఏదైనా అభ్యంతరకరంగా చెబితే, వీలైనంత త్వరగా వారి నుండి దూరంగా వెళ్లండి.
ఆతర్వాత, మీరు ఆ ఘాతం నుండి బయటపడిన తర్వాత, మీ మానసిక స్థితి మెరుగ్గా ఉన్న స్థితిలో, ఆత్మహత్య గురించి నిర్లక్ష్యంగా మాట్లాడే అజ్ఞానులు మీకు ఎదురుకావచ్చు. అయితే, మీరు మానసికంగా మరియు భావోద్వేగపరంగా దృఢంగా ఉన్నప్పుడు అవేవీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు మరియు మీరు దుఃఖించే పరిస్థితి తీసుకురావు.