ప్రియమైన వారి ఆత్మహత్య తర్వాత నాకు నేను మంచి సంరక్షణ అందించుకోవాల్సిన అవసరమేమిటి
ఆత్మహత్య కారణంగా, మీ ప్రియమైన వారిని కోల్పోయిన తర్వాత మీరు అనుభవించే తీవ్రమైన భావోద్వేగపరమైన నొప్పి మరియు గందరగోళం కారణంగా, మీరు పని చేయడం కష్టతరంగా మారుతుంది. ఆత్మహత్య తర్వాత మీరు ముందుకు సాగడం చాలా కష్టంగా ఉంటుంది. మీరు స్వస్థత పొందడమనేది నెమ్మదిగా జరిగే ప్రక్రియగా ఉండొచ్చు. కాబట్టి, తొందరపాటు పడకండి. మీ పట్ల మీరు ఓపికగా మరియు సున్నితంగా ఉండండి.
దృష్టి కేంద్రీకరించడంలో మీకు ఇబ్బంది ఉంటే, మరచిపోవడం లేదా దృష్టి పెట్టడం సాధ్యం కాకపోతే, మీరు సర్వసాధారణ మరియు ఒత్తిడితో కూడిన భావోద్వేగాలకు గురవుతున్నారని దయచేసి తెలుసుకోండి మరియు మీ మీద మీరే అధిక భారం వేసుకోకండి. మీ రోజువారీ వ్యవహారాల్లో సహాయం పొందడానికి ప్రయత్నించండి. చిన్న పనులు సైతం ఇప్పుడు మీకు కష్టంగా అనిపించవచ్చు. కాబట్టి, మీకు అవసరమైనప్పుడు సహాయం కోసం అడగండి. మీరు పని చేయడానికి సిద్ధమైతే, వీలైనంత ఎక్కువ సమయం విరామం తీసుకోండి.
మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారని మరియు వ్యాయామం చేస్తున్నారని నిర్ధారించుకోండి. ఆ రెండు పనులు చేయడం మీకు చాలా సహాయపడుతుంది.
కొన్ని రకాల సేదతీరే కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చాలా సహాయకరంగా ఉంటుంది. మీకు ఉపశమనం కలిగింగలవని మీకు తెలిసిన కొన్ని పనులు చేయండి. స్నానం చేయండి. నడకకు వెళ్ళండి. ఆహ్లాదకర సంగీతం వినండి. విశ్రాంతినిచ్చే పుస్తకాలు చదవండి లేదా ఏవైనా యానిమేషన్లు/కార్టూన్లు చూడండి.
మీకు వీలైనప్పుడల్లా, మీరు ఆనందించే పనులు చేయండి. మీరు మళ్లీ మీ జీవితాన్ని ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతించండి. మీరు నవ్వుతూ, మంచి సమయం గడుపుతూ లేదా మీ ఓటమి తర్వాత మళ్లీ మీ జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడూ అపరాధ భావనకు లేదా చెడు అనుభూతికి లోను కాకండి. మీరు మీ స్వస్థత ప్రక్రియ చేపట్టడాన్ని మీ ప్రియమైన వ్యక్తి జ్ఞాపకాలకు చేసే ద్రోహంగా భావించకండి.