ఫీమేల్ కండోమ్ మహిళలు ధరించే కండోమ్ను ఎలా ఉపయోగించాలి
From Audiopedia - Accessible Learning for All
1. ప్యాకెట్‌ని జాగ్రత్తగా తెరవండి.
2. కండోమ్‌లో మూసి ఉండే చివర్లో ఉండే రింగ్ భాగం కనుగొనండి.
3. లోపలి రింగ్‌ని మడిచి పట్టుకోండి.
4. లోపలి రింగ్‌ని యోనిలోకి ఉంచండి.
5. మీ వేలి సాయంతో, ఆ లోపలి రింగ్ మీ యోని లోపలకి వెళ్లేలా తోయండి. బయటి రింగ్ యోని వెలుపల ఉంటుంది.
6. మీరు సెక్స్‌కి సిద్ధమైనప్పుడు, పురుషాంగం ఆ బయటి రింగ్ లోపలకు వెళ్లేలా చూడండి.
7. సెక్స్ ముగిసి, మీరు పైకి లేవడానికి ముందే ఫీమేల్ కండోమ్ తొలగించండి. పురుషుడి వీర్యం కండోమ్ లోపలే ఉండేలా చేయడం కోసం బయటి రింగ్ వద్ద పట్టుకుని మెలి తిప్పి, ఆ తర్వాత, కండోమ్‌ని బయటకు తీయండి. కండోమ్‌ని సున్నితంగా బయటకు తీసిన తర్వాత, దానిని ముడివేసి, పిల్లలు మరియు జంతువులకు అందుబాటులో లేకుండా పారవేయండి.