బాయ్‌ఫ్రెండ్ మరియు సెక్స్ గురించి నేను ఎలా నిర్ణయించుకోవాలి
చాలామంది యువతీయువకుల్లో వయసు పెరిగేకొద్దీ, ప్రేమ లేదా సెక్స్ భావాలు మొదలవుతాయి. లైంగిక ప్రేరణతో ఎవరినైనా తాకాలనుకోవడం, ఎవరైనా తమని తాకాలనే ఆలోచన అసాధారణమేమీ కాదు. (అమ్మాయిల్లో అలాంటి భావన వేరొక అమ్మాయి లేదా స్త్రీ మీద కూడా కలగవచ్చు). అయితే, ఈ భావాలతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికి ముందే చాలామంది వీటిని అనుభవించేస్తుంటారు.
సెక్స్ సంబంధిత హాని నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో మీకు తెలుసని మీరు నిర్ధారించుకున్న తర్వాత, దానికి సిద్ధమవ్వండి. సెక్స్ గురించి భయం గానీ, బిడియం గానీ లేనప్పుడే, భాగస్వాములిద్దరూ సెక్స్‌ని ఆస్వాదించగలరు.
అయితే, యువతులు అనేక కారణాలతో సెక్స్‌కి సిద్ధమవుతుంటారు. కొందరు బిడ్డను కనేందుకు దానికి సిద్ధమవుతారు. మెరుగైన భావన కోసం లేదా అవసరం కోసం మరికొందరు దానికి సిద్ధమవుతారు. ఒక భార్యగా లేదా ప్రేయసిగా అది తన విధి కాబట్టి, ఆ విషయంలో తమకి ఎలాంటి ఎంపిక ఉండదని మరికొందరు అమ్మాయిలు భావిస్తారు. ఇంకొందరు డబ్బు కోసం లేదా వారు జీవించడానికి అవసరమైన ఇతర విషయాల కోసం, అంటే, తిండి కోసం లేదా తమ పిల్లలకు దుస్తులు లేదా నివాస స్థలం అందించడం కోసం సెక్స్‌ని వ్యాపారంలా చేస్తారు.
సెక్స్ అనేది ఎదుటి వ్యక్తి తనని మరింత ప్రేమించేలా చేస్తుంది కాబట్టి, కొందరు దానికి సిద్ధమవుతారు. కొన్నిసార్లు ఒక అమ్మాయి సెక్స్‌కి సిద్ధం కానప్పటికీ, వారి స్నేహితుడు లేదా ప్రియుడు ఆమెని బలవంత పెట్టి, దానికి ఒప్పించవచ్చు.
అయితే, ఆమెకి ఇష్టం లేనప్పుడు ఎవరూ ఆమెని సెక్స్ కోసం బలవంత పెట్టకూడదు. మీరు సెక్స్‌కి సిద్ధంగా ఉన్నారనుకున్నప్పుడే దానికోసం సిద్ధపడండి. సెక్స్ బంధాన్ని మీ ఇద్దరూ ఆస్వాదించవచ్చు. కానీ, మీకు భయం లేదా బిడియంగా ఉన్నప్పుడు లేదా సమ్మతి ఇవ్వలేనప్పుడు ఆ ఆనందం పొందడం కష్టం.
మీరు సెక్స్ బంధానికి సిద్ధమైనప్పుడు ఎల్లప్పుడూ గర్భం మరియు వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.