బాలికల ప్రత్యేక ఆరోగ్య అవసరాలు ఏమిటి
10 నుండి 15 సంవత్సరాల మధ్య వయసులో, అమ్మాయి శరీరంలో పెరగుదల వేగవతం కావడం మరియు వయోజన పరిమాణానికి చేరడం మొదలవుతుంది. ఈ దశ ఒక ఉద్విగ్నభరితమైనదిగా మరియు ఇదొక సంక్లిష్ట కాలంగా ఉండవచ్చు. ఈ దశలో ఆమెకి తానొక అమ్మాయినా లేదంటే మహిళనా అనే స్థిరంగా తెలియకపోవచ్చు. ఎందుకంటే, ఆమె శరీర స్థితి ఈ రెండింటికీ మధ్యలో ఉంటుంది. ఆమెకి అప్పటివరకు అలవాటు లేని కొత్త పనులెన్నో శరీరం చేస్తుంటుంది. ఆ మార్పుల గురించి ఎవరూ మాట్లాడకపోవడం వల్ల ఆ సమయంలో తనకేం కావాలో ఆ అమ్మాయికి స్పష్టంగా తెలియకపోవచ్చు.
ఒక అమ్మాయి ఆరోగ్యంగా ఉండాలంటే, ఆ అమ్మాయి బాగా తినడమనేది ఒక కీలక విషయం. ఆమె ఎదుగుతున్న సంవత్సరాల్లో ఆమె శరీరానికి తగినంత ప్రోటీన్, విటమిన్లు మరియు ఖనిజలవణాలు లభించాలి. ఒక అబ్బాయికి కనీసంగా ఎంత ఆహారం కావాలో, ఒక అమ్మాయికి కూడా అంత ఆహారం కావాలి. తగినంతగా తినడం వల్ల తక్కువ అనారోగ్యం మరియు పాఠశాలలో ఎక్కువ విజయాలు, ఆరోగ్యకర గర్భధారణలు, సురక్షిత జననాలు మరియు ఆరోగ్యకరమైన వృద్ధాప్యం లాంటివన్నీ సాధ్యమవుతాయి.
బాలికలకు కూడా సరైన ఆహారం అవసరం. ఒక అమ్మాయి తన నెలసరి రక్తస్రావం ప్రారంభించినప్పటి నుండి ఆమె ప్రతినెలా కొంత రక్తం కోల్పోతుంది. కాబట్టి, ఆమెలో బలహీన రక్తం (రక్తహీనత) నివారించడానికి, ఐరన్ కలిగిన ఆహారాలు తినడం ద్వారా, కోల్పోయిన రక్తాన్ని ఆమె భర్తీ చేసుకోవాలి. అలాగే, బాలికలు మరియు మహిళలు ఇద్దరిలోనూ ఎముకలు బలంగా పెరగడంలో సహాయపడటానికి కాల్షియం కలిగిన ఆహారాలు అవసరం.