బిందు సేద్యం అంటే ఏమిటి మరియు అది ఎందుకు ముఖ్యమైనది
బిందు సేద్యం అనేది మొక్కల వేళ్లకు నేరుగా నీటిని అందించే వాతావరణ అనుకూల నీటిపారుదల వ్యవస్థ. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో, పంట ఉత్పత్తిలో నీటిపారుదల అనేది ఒక అవసరం. వర్షపాతం ఉన్నప్పటికీ, కొన్ని పంటలకు నీటిపారుదల తప్పనిసరి. ప్రత్యేకించి, శుష్క మరియు పాక్షిక-శుష్క ప్రాంతాల్లో ఈ అవసరం ప్రధానంగా ఉంటుంది. తీవ్రమైన వేడి మరియు పొడి వాతావరణ పరిస్థితుల్లో పంట చక్కగా పెరగడం మరియు దాని ఫలసాయం పెద్ద సవాలుగా ఉంటాయి. అదేసమయంలో, పంటలకు నీటిపారుదల అత్యంత ముఖ్యమైనప్పటికీ, ఎక్కువ నీళ్లు పారించడం వల్ల పోషకాలు కొట్టుకుపోవడం, వేర్లు సరిగ్గా పెరగకపోవడం, నీళ్లు నిలిచిపోవడం, వేర్లు మీద ఉప్పు పేరుకుపోవడం, పంట నాణ్యత మరియు దిగుబడి తగ్గడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
ఇలాంటి పరిస్థితుల్లో, రైతులకు డబ్బు ఆదా చేయడంతో పాటు పంట దిగుబడిని పెంచడంలో ఉపయోగపడే ఒకానొక నీటిపారుదల విధానమే ఈ బిందుసేద్యం. బిందు సేద్యంలో మొక్క వేళ్ల వద్ద నెమ్మదిగా నీళ్లు అందించడం ద్వారా నీటిని ఆదా చేయవచ్చు. కాబట్టి, మీ పంట మెరుగ్గా పెరగడానికి మరియు అధిక దిగుబడి సాధిండానికి మీరు బిందు సేద్యం వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు.