బిందు సేద్య వ్యవస్థను నేను ఏవిధంగా నిర్వహించాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

బిందు సేద్యం వ్యవస్థ బాగా పనిచేయడం కోసం, మొక్కలకు నీటిపారుదల చక్కగా జరిగేలా రైతులు అన్ని సమయాల్లోనూ జాగ్రత్తగా చూసుకోవాలి. రైతులు క్రింది నిర్వహణ చిట్కాలు పాటిస్తే, బిందు సేద్యం వ్యవస్థ చక్కగా పనిచేయడంలో సహాయపడుతాయి:

  • అన్ని సమయాల్లోనూ స్వచ్ఛమైన నీటిని ఉపయోగించాలి.
  • నీటి పైపులు, గొట్టాలు మరియు బిందు సేద్యం గొట్టాలు దెబ్బతినకుండా ఉండాలంటే, పొలంలోని బిందు సేద్యం వ్యవస్థతో పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
  • చెదపురుగులు, ఎలుకలు, నిరోధిత ఉద్గారకాలు మరియు నీటి నష్టానికి కారణమయ్యే స్రావాలు లాంటి వాటి కారణంగా ఏదైనా విధ్వంసం జరిగే పరిస్థితిని ముందే కనిపెట్టడం కోసం క్రమం తప్పకుండా ఆ వ్యవస్థను తనిఖీ చేయాలి.
  • ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తున్నారని నిర్ధారించుకోవాలి.
  • నష్టం అడ్డుకోవడం కోసం బిందు సేద్యం వ్యవస్థతో అవసరం లేనప్పుడు దానిని సరైన స్థితిలో నిల్వ చేసినట్టు నిర్థారించుకోవాలి.
  • ఆవిరి ద్వారా నీటి నష్టం తగ్గించడానికి మరియు కలుపు మొక్కల పెరుగుదల అడ్డుకోవడానికి మొక్కల మధ్య గడ్డి (గడ్డి లాంటి పొట్టు) వేయాలి.
Sources
  • Audiopedia ID: tel030206