బిగదీసుకుపోవడాన్ని నేనెలా నిరోధించగలను మరియు నా కండరాలను బలంగా ఉంచుకోగలను
From Audiopedia - Accessible Learning for All
బిగుదీసుకుపోవడాన్ని నిరోధించడానికి మరియు మీ కండరాలను బలంగా ఉంచుకోవడానికి, మీరు ప్రతిరోజూ మీ చేతులు మరియు కాళ్ళకు వ్యాయామం చేయించే వ్యక్తి సహాయం తీసుకోవాలి. మీ శరీరంలోని ప్రతి భాగం కదులుతూ ఉండేలా చూసుకోండి. కండరాలు బిగదీసిన పరిస్థితి మీకు చాలా సంవత్సరాలుగా ఉంటే, మీ కీళ్ళను పూర్తి నిఠారుగా చేయడం కష్టం అవుతుంది. అయితే, ఈ వ్యాయామాలనేవి బిగదీసుకుపోయిన పరిస్థితి మరింత తీవ్రం కాకుండా నిరోధిస్తాయి మరియు మీ కీళ్ళను కొంచెం గట్టిగా చేసి, మీ కండరాలను బలంగా ఉంచుతాయి.
గుర్తుంచుకోండి: కీళ్ళు చాలా కాలంగా వంగిపోయి ఉంటే, వాటి విషయంలో సున్నితంగా వ్యవహరించండి. బలప్రయోగంతో వాటిని నిటారిగా చేసే ప్రయత్నం చేయకండి.