బెదిరించడానికి' లేదా ప్రతీకారం తీర్చుకోవడానికి నేను ఆత్మహత్యా ప్రయత్నాలు ఎందుకు చేయకూడదు

From Audiopedia
Jump to: navigation, search

ఇతరులను 'బెదిరించడానికి' మీరు ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంటే, మీ విషయంలో జాగ్రత్త వహించండి (ప్రత్యేకించి, మహిళల ఆత్మహత్యా యత్నాలు చాలావరకు ఈవిధంగా ఉంటాయి). ఎందుకంటే, మీ జీవితం అంతం చేసుకోవాలనే నిజమైన కోరిక కంటే మీ చర్యలనేవి మీ కోపం, అసూయ, బాధ లేదా ప్రతీకారం నుండి ప్రేరేపించబడినవి కావచ్చు. ఇలాంటి సందర్భంలో మీరు హఠాత్తుగా అలా వ్యవహరిస్తుంటారు.

మీకు చాలా బాధ కలిగించే సంఘర్షణలు లేదా సమస్యలు పరిష్కరించడానికి లేదా మీరు దాదాపుగా భరించలేని జీవిత పరిస్థితులు మార్చడానికి మీరు ఇప్పటికే చాలాసార్లు ఆత్మహత్యా యత్నం చేసి ఉండవచ్చు. మీ చుట్టూ ఉన్న ఎవరూ నిజంగా మీ గోడు వినడం లేదని లేదా మీకు సహాయం చేయడానికి వాళ్లెవరూ సిద్ధంగా లేరని మీకు అనిపించవచ్చు లేదంటే, మీరు అవమానకర అనుభవం లేదా అనుభవాలు అనుభవించి ఉండవచ్చు (ఉదాహరణకు మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేయడం, లేదా మీ అత్తగారు మిమ్మల్ని ఎల్లప్పుడూ అవమానించడం లేదా అణచివేయడం లాంటివి). ఏదేమైనప్పటికీ, మీరు వారిని అదే రీతిలో కష్టపెట్టడానికి ఒక మార్గంగా ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మీ ఆలోచనలు ఇలా ఉండవచ్చు:

  • నేను ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే/నేను చనిపోయే పరిస్థితి వస్తే...
  • ...నాకు చేసిన అన్యాయాలు తలచుకుని వాళ్లు చింతిస్తారు.
  • ...అప్పుడైనా వాళ్లు నేను చెప్పేది వింటారు మరియు నా ఉద్దేశ్యం తెలుసుకుంటారు.
  • ...నేను వాళ్ల సహాయం మరియు మద్దతు తీవ్రంగా కోరుకుంటున్నానని వాళ్లు గ్రహిస్తారు.
  • ...నేను కోరుకున్న విధంగా వాళ్లు నన్ను ప్రేమిస్తారు.
  • ...వాళ్లు అపరాధభావంతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. నన్ను క్షమాపణ కోరుతారు.
  • ...వాళ్లు తమ ప్రవర్తన మార్చుకుంటారు.
  • దురదృష్టవశాత్తూ, బెదిరించడం కోసం చేసే ఆత్మహత్యా యత్నాల్లో చాలాసార్లు (దాదాపు 99.90% సందర్భాల్లో) ఊహించిన విధంగా జరగదు. బదులుగా, ఒకవేళ మీరు ప్రాణాలతో బయటపడితే, మీరు బహుశా మరింత అణచివేత మరియు నిందలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే, మీరు మీ ఆత్మహత్య ప్రయత్నం ద్వారా ఆ కుటుంబాన్ని 'అగౌరవపరిచారు' లేదా మీరు మానసికంగా పిచ్చివాళ్లనే ముద్రకు గురయ్యారు. అలాగే, పొరపాటున మీ ఆత్మహత్యా యత్నం నిజమైతే, మీరు చనిపోతారు. అయితే, అదేమీ వాళ్ల మీద ప్రభావం చూపదు. మీరు చనిపోయారు కాబట్టి, ఇతరుల దుఃఖం, జాలి లేదా ఆప్యాయత ఏదీ మీరు ఆస్వాదించలేరు.

గుర్తుంచుకోండి: ఇతరులను 'బెదిరించడం కోసం' ఎప్పుడూ ఆత్మహత్య ప్రయత్నాలు చేయకండి.

Sources
  • Audiopedia ID: tel020912