భారీ బరువులు ఎత్తడం మరియు మోయడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను నేనెలా నిరోధించగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

సురక్షితంగా ఎత్తడం ఎలా:

వెన్నునొప్పి సమస్యలు వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే, వాటిని నిరోధించడమే సులభం. వీలైనప్పుడల్లా, మీ కాళ్లకు పని చేప్పండి. మీ వెన్నెముకకు కాదు. ఎత్తే సమయంలో కాళ్ల కండరాలు ఉపయోగించండి. వెన్ను కండరాలు కాదు. వస్తువులు లేదా పిల్లలను నేల మీద నుండి పైకి ఎత్తేటప్పుడు వంగి కాకుండా, క్రింద కూర్చున్న భంగిమలో వాళ్లని పైకెత్తండి.

  • మీ వీపు, భుజాలు మరియు మెడను వీలైనంత నిటారుగా ఉంచండి.
  • గర్భధారణ సమయంలో లేదా ప్రసవించిన వెంటనే భారీ వస్తువులు ఎత్తడం లేదా మోయడం చేయకండి.
  • భారీ వస్తువులు ఎత్తేటప్పుడు మీకు సహాయం చేయాల్సిందిగా ఎవరినైనా అడగండి. మీరొక్కరే ఎత్తడం త్వరగా పని పూర్తయినట్టు అనిపించవచ్చు. కానీ, ఆ తర్వాత, వెన్నునొప్పి కారణంగా మీరు ఆ సమయం కోల్పోవచ్చు.

ఎలా సురక్షితంగా తీసుకెళ్లాలి:

  • వస్తువులను మీ శరీరానికి దగ్గరగా తీసుకెళ్లండి.
  • వీలైతే, వస్తువులను మీ శరీరానికి పక్క నుండి కాకుండా మీ వీపు మీద తీసుకెళ్లండి. ఈ విధంగా మీ వీపుకి ఒక వైపు కండరాలు మాత్రమే అన్ని పనులు చేయాల్సిన అవసరం ఉండదు. ఒకే వైపు బరువు మోయడం వల్ల కూడా మీ వెన్నెముకను ఎక్కువగా తిప్పేలా చేస్తుంది. అది వెన్నునొప్పి కలిగించవచ్చు.
  • మీరు వస్తువులను ఒక వైపు తీసుకెళ్తుంటే, తరచుగా బరువును రెండు వైపులా మార్చే ప్రయత్నం చేయండి. తద్వారా, మీ వీపుకి ఇరువైపులా ఉన్న కండరాలు ఒకే మొత్తంలో పనిచేస్తాయి మరియు మీ వెన్నెముక రెండు వైపులా తిరుగుతుంది. కాబట్టి, భారం అన్ని వైపులా సమానంగా పడుతుంది.
  • తల పట్టీలు ఉపయోగించకుండా ఉండే ప్రయత్నం చేయండి. అవి మీ మెడ కండరాల మీద ఒత్తిడి చేయగలవు.

సురక్షితంగా ముందుకు ఎలా వంగాలి:

  • మహిళలు తరచుగా కడుక్కోవడం, వ్యవసాయం చేయడం లేదా ఇతర పనులు చేసే సమయంలో ఎక్కువ సమయం ముందుకు వంగి ఉండడం వల్ల మహిళల్లో వెన్నునొప్పి కలిగించవచ్చు. మీరు ఈ విధంగా పని చేయాల్సి వస్తే, తరచుగా కండరాలు సాగదీసే ప్రయత్నం చేయండి. మీకు వెన్నునొప్పి రావడం మొదలైతే, కూర్చోవడం లేదా మోకరిల్లడం లాంటి కొన్ని విభిన్న భంగిమలు ప్రయత్నించండి మరియు తరచుగా స్థానాలు మార్చుకోండి.
  • నేల మీద వస్తువులు అందుకోవడానికి వంగకండి బదులుగా, మీ మోకాళ్లు వంచి, మీ వీపు నిటారుగా ఉంచినట్టుగా కూర్చోండి.
Sources
  • Audiopedia ID: tel030107