మద్యం లేదా మాదకద్రవ్యాలకు ప్రజలు అలవాటు పడడానికి కారణమేమిటి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

సామాజిక ఒత్తిడి కారణంగా ప్రజలు తరచుగా మద్యం లేదా మాదకద్రవ్యాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. అబ్బాయిలు మరియు పురుషులు వారి పురుషత్వం నిరూపించుకునే పేరుతో త్రాగడం లేదా ఇతర సాధారణ మాదకద్రవ్యాలు ఉపయోగించాల్సిన ఒత్తిడి ఎదుర్కోవచ్చు. ఒక వ్యక్తి తాను ఎంత ఎక్కువ తాగితే, లేదా ఎంత ఎక్కువ మాదకద్రవ్యాలు ఉపయోగిస్తే, అంత ఎక్కువ పురుషత్వంతో ఉంటానని నమ్మవచ్చు. కొంతమంది మద్యం మరియు మాదకద్రవ్యాలు ఉపయోగించినప్పుడు కలిగే అనుభూతి కోసం వాటికి అలవాటు పడుతారు.

చాలామంది బాలికలు మరియు మహిళలు కూడా మద్యపానం లేదా మాదకద్రవ్యాలు తీసుకునేలా సామాజిక ఒత్తిడి ఎదుర్కోనే పరిస్థితి మొదలైంది. తద్వారా, తాము మరింత ఎదిగినట్లుగా లేదా మరింత ఆధునికంగా కనిపిస్తామని వారు భావించవచ్చు లేదా ఇతరులు తమను మరింత సులభంగా అంగీకరిస్తారని కూడా వాళ్లు భావించవచ్చు. మద్యం మరియు మాదకద్రవ్యాలు తయారు చేసి విక్రయించే కంపెనీలు కూడా ఈ సామాజిక ఒత్తిడిని ప్రయోగిస్తాయి. మాదకద్రవ్యాలు మరియు మద్యం అలవాటుని ఆకర్షణీయంగా ప్రదర్శించే ప్రకటనలనేవి ప్రత్యేకించి యువత వాటిని కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తాయి. కొన్ని ప్రకటనలు, సంగీతం మరియు చలనచిత్రాలు సైతం మద్యం తాగడానికి మరియు మాదకద్రవ్యాల వినియోగానికి యువతను ప్రోత్సహిస్తాయి. మద్యం తయారు చేసే కంపెనీలు లేదా మద్యం విక్రయించే ప్రదేశాల నుండి కొనుగోలు చేయడం సులభంగా మరియు అదొక సరదా పనిగా అనిపించినప్పుడు ప్రజలు వాటిని మరింతగా కొనుగోలు చేయాలనుకుంటారు. ఈ రకమైన ఒత్తిడి అత్యంత హానికరం. ఎందుకంటే, అది తమను ప్రభావితం చేస్తుందనే సంగతి కూడా తరచుగా ప్రజలకు తెలియదు.

Sources
  • Audiopedia ID: tel010302