మద్యపానం లేదా మాదకద్రవ్యాల అలవాటుని నేనెలా దూరం చేసుకోవచ్చు
1. మీకు సమస్య ఉందని అంగీకరించండి.
2. ఈ రోజే ఏదోఒకటి చేయాలని నిర్ణయించుకోండి.
3. తక్షణం ఆపేయండి లేదా వినియోగం తగ్గిస్తూ, కొద్దిరోజుల్లో ఆపేయండి. మద్యపానం లేదా మాదకద్రవ్యాల అలవాటును చాలామంది ఒకేరోజులో నిలిపివేయగలరు. వారికి కావలసిందల్లా తాము ఆపేయగలమనే సంకల్పం మరియు తాము ఆవిధంగా చేయగలమనే నమ్మకం మాత్రమే. మరికొందరి విషయంలో, మద్యపానం లేదా మాదకద్రవ్యాల సమస్యలతో బాధపడే వ్యక్తులకు సహాయపడే ఆల్కహాలిక్స్ అనానిమస్ (AA) లాంటి గ్రూప్ నుండి లేదా చికిత్స కార్యక్రమం ద్వారా సహాయం అవసరం కావచ్చు. అనేక దేశాల్లో ఈ AA గ్రూపులు ఉన్నాయి. మీ ప్రాంతంలోని ఇలాంటి ఇతర సమూహాలు లేదా చికిత్సా కార్యక్రమాలు కూడా ఉండవచ్చు. చాలామంది మహిళలు మహిళా సమూహంలోనే ఎక్కువ సౌకర్యంగా ఉండగలరు. మీ ప్రాంతంలో ఇలాంటి సమూహాలు లేకపోతే, మద్యపానం లేదా మాదకద్రవ్యాల అలవాటు ఆపేలా వ్యక్తులకు సహాయం చేయడంలో విజయవంతమైన వారితో మీ స్వంత సమూహం ప్రారంభించే ప్రయత్నం చేయండి.
4. మీరు మళ్ళీ తాగడం లేదా మాదకద్రవ్యాలు వాడకం ప్రారంభిస్తే, మిమ్మల్ని మీరు నిందించుకోకుకుండా, ఆ అలవాటు ఆపేయడానికి మళ్లీ ప్రయత్నించండి.