మధుమేహాన్ని నేనెలా నియంత్రించగలను
మీకు టైప్ 2 మధుమేహం ఉంటే, మీ రక్తంలో చక్కెర స్థాయి తనిఖీ చేయడానికి మరియు మీకు మందులు అవసరమా అని తెలుసుకోవడానికి మీరు ఆరోగ్య కార్యకర్తన వద్దకు వెళ్లాలి. మీరు జాగ్రత్తగా తినడం ద్వారా మీ మధుమేహాన్ని నియంత్రించవచ్చు:
సాధ్యమైతే, మీ అనారోగ్యం మరింత తీవ్రమవకుండా చూసుకోవడానికి క్రమం తప్పకుండా మీ ఆరోగ్య కార్యకర్తను కలుసుకోండి.
చర్మంపై ఇన్ఫెక్షన్ మరియు గాయాలు నివారించడానికి, తిన్న తర్వాత మీ దంతాలను శుభ్రం చేసుకోండి, మీ చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోండి మరియు పాదాలకు గాయాలు కాకుండా నివారించడానికి ఎల్లప్పుడూ బూట్లు ధరించండి. మీకు ఏవైనా పుళ్ళు ఉన్నాయా అని తెలుసుకోవడానికి రోజుకు ఒకసారి మీ పాదాలు మరియు చేతులు తనిఖీ చేయండి. మీకు ఏదైనా పుండు ఉంటే మరియు ఇన్ఫెక్షన్ సంకేతాలు (ఎరుపు, వాపు లేదా వేడి) ఉంటే, ఆరోగ్య కార్యకర్తను కలవండి.
సాధ్యమైనప్పుడల్లా, మీ పాదాలను పైకి లేపి విశ్రాంతి తీసుకోండి. మీ పాదాలు ముదురు రంగులో ఉండి, తిమ్మిరిగా మారితే ఇది చాలా ముఖ్యం. మీ పాదాలకు రక్తం వెళ్లడం మరియు రావడం తక్కువగా ఉందని ఈ సంకేతాలు సూచిస్తున్నాయి.