మలిదశలో గర్భం మరియు STI ల నుండి ఎలా రక్షించుకోవాలి
From Audiopedia - Accessible Learning for All
మీ నెలసరి రక్తస్రావం ఒక సంవత్సరం పాటు ఆగిపోయే వరకు కూడా మీరు గర్భవతి అయ్యే అవకాశం ఉంది. అవాంఛిత గర్భధారణను నిరోధించడం కోసం మీరు ఆ సమయంలో కుటుంబ నియంత్రణ పద్ధతిని ఉపయోగించడం కొనసాగించాలి.
కుటుంబ నియంత్రణ కోసం మీరు హార్మోన్ల పద్ధతిని (మాత్రలు, ఇంజెక్షన్లు లేదా ఇంప్లాంట్లు) ఉపయోగిస్తుంటే, మీకు ఇంకా నెలసరి రక్తస్రావం వస్తోందా అని చూడడం కోసం 50 సంవత్సరాల వయస్సులో వాటిని ఉపయోగించడం మానేయండి. ఏడాది (12 నెలలు) పాటు మీకు నెలసరి రక్తస్రావం రానంతవరకు కుటుంబ నియంత్రణ కోసం వేరొక పద్ధతి ఏదైనా పాటించండి.
మీకు లేదా మీ భాగస్వామికి HIVతో సహా, STI కూడా లేదని మీకు ఖచ్చితంగా తెలియకపోతే, లైంగిక ప్రక్రియ సమయంలో ప్రతిసారి మీరు కండోమ్ ఉపయోగించారని నిర్ధారించుకోండి-మీరు ఇకపై గర్భవతి అయ్యే అవకాశం లేనప్పటికీ, ఆ విధంగా చేయండి.