మలేరియా అంటే ఏమిటి
మలేరియా అనేది దోమ కాటు ద్వారా వ్యాపించే తీవ్రమైన వ్యాధి. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో మలేరియా కనిపిస్తుంది. ఉప-సహారా ఆఫ్రికాలో, ఇది చిన్న పిల్లల్లో మరణం, అనారోగ్యం మరియు పెరుగుదల మరియు వికాసంలో లోపాలకు ప్రధాన కారణంగా ఉంటోంది. ఈ ప్రాంతంలో ప్రతి 30 సెకన్లకు ఒక చిన్నారి మలేరియాతో మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
అనాఫిలిస్ దోమ కాటు ద్వారా మలేరియా వ్యాపిస్తుంది. దోమ ద్వారా మలేరియా పరాన్నజీవి అయిన ప్లాస్మోడియం వ్యక్తి నుండి వ్యక్తికి బదిలీ చేయబడుతుంది. మలేరియా సోకిన వ్యక్తులు అధిక జ్వరం, విరేచనాలు, వాంతులు, తలనొప్పి, చలి మరియు ఫ్లూ లాంటి అనారోగ్యంతో అత్యంత అనారోగ్యానికి గురవుతారు. ప్రత్యేకించి, పిల్లల్లో వ్యాధి వేగంగా తీవ్రమవుతుంది. కోమాలోకి వెళ్లి, మరణిస్తారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లలు ఎక్కువగా మలేరియాకు గురవుతారు.వారిలో మలేరియాను నిరోధించగల రోగనిరోధక శక్తిని చాలా తక్కువగా ఉండడమే అందుకు కారణం.