మళ్ళీ హింస జరగడానికి ముందు నా భద్రత కోసం నేనేం చేయగలను
From Audiopedia
హింసా గురించి సమీపంలోని ఎవరికైనా చెప్పండి. మీరు ఇబ్బందుల్లో ఉన్నారని ఆ వ్యక్తి గ్రహిస్తే, మీ వద్దకు రావాల్సిందిగా లేదా సహాయం చేయాల్సిందిగా అడగండి. దానివల్ల, మీరు తీవ్రంగా గాయపడడానికి ముందే మీ పొరుగువారు, పురుష బంధువులు లేదా స్త్రీలు లేదా పురుషుల సమూహం మీ వద్దకు రావచ్చు.
మీ భావాలను క్రమబద్ధీకరించడానికి మరియు మీ ఎంపికల గురించి ఆలోచించడానికి మీకు సహాయపడగల మీరు విశ్వసించే వ్యక్తి కోసం వెతకండి.
సహాయం కోసం ప్రయత్నించాల్సిందిగా మీ పిల్లలకు లేదా మీ కుటుంబంలోని వేరొకరికి సూచించే ప్రత్యేక పదం లేదా సంకేతం గురించి ఆలోచించండి.
సురక్షిత ప్రదేశానికి ఎలా చేరుకోవాలో మీ పిల్లలకు నేర్పండి.