మహిళకు ఎదురయ్యే సర్వసాధారణ మానసిక సమస్యలు ఏవి
From Audiopedia - Accessible Learning for All
అనేక రకాల మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, ఒక మహిళ విషయంలో ఆందోళన, నిరాశ మరియు మద్యం లేదా మాదకద్రవ్యాల దుర్వినియోగం లాంటివి సర్వసాధారణమైనవిగా ఉంటాయి. చాలా సమాజాల్లో, పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఆందోళన మరియు నిరాశతో బాధపడుతుంటారు. అయితే, మద్యం లేదా మాదకద్రవ్యాల దుర్వినియోగంతో వచ్చే సమస్యలనేవి మహిళల కంటే పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది.