మహిళల కండోమ్‌లు స్త్రీలు ధరించేవి గురించి నేనేం తెలుసుకోవాలి
స్త్రీ యోని లోపలకు వెళ్లడంతో పాటు బయటి పెదవులను కూడా కప్పి ఉంచే ఫీమేల్ కండోమ్‌ని సెక్స్‌కి ముందు ఎప్పుడైనా ఉంచుకోవచ్చు. దీనిని ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే, దీనిని రెండోసారి ఉపయోగిస్తే, అది చిరిగిపోయే అవకాశం ఉంది. కానీ, మీకు కొత్త కండోమ్ అందుబాటులో లేకపోతే, మీరు దానిని శుభ్రం చేయడం ద్వారా, 5 సార్లు వరకు మళ్లీ మళ్లీ ఉపయోగించవచ్చు. ఫీమేల్ కండోమ్ మరియు పురుషుల కండోమ్ ఒకేసారి ఉపయోగించకూడదు.
ఫీమేల్ కండోమ్‌లనేవి పురుషుల కోసం తయారు చేసిన కండోమ్‌ల కంటే పెద్దవిగా ఉంటాయి మరియు చిరిగిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. సెక్స్ సమయంలో పురుషుడు పైన ఉండి మరియు స్త్రీ క్రింద ఉన్నప్పుడు ఇవి ఉత్తమంగా పనిచేస్తాయి.
HIVతో సహా గర్భం మరియు STIల నుండి రక్షణ కోసం మహిళల నియంత్రణలో ఉండగల పద్ధతుల్లో ఫీమేల్ కండోమ్ అత్యంత ప్రభావవంతమైనది. ప్రస్తుతం 3 రకాల ఫీమేల్ కండోమ్‌లు అందుబాటులో ఉన్నాయి. సరికొత్తగా అందుబాటులోకి వచ్చినవి తక్కువ ఖరీదైనవి. VA ఫీమేల్ కండోమ్ అనేది స్త్రీ శరీరంలోకి మరింత దగ్గరగా చొచ్చుకుపోతుంది కాబట్టి, ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది మరియు సెక్స్ సమయంలో తక్కువ శబ్దం చేస్తుంది.
ఫీమేల్ కండోమ్‌లు ప్రస్తుతం కొన్ని ప్రదేశాల్లోనే అందుబాటులో ఉన్నాయి. అయితే, మరింత ఎక్కువ మంది ఈ పద్ధతి కోరుకుంటే, మరిన్ని కార్యక్రమాల ద్వారా అవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.