మహిళల మీద ఎలాంటి హింసలు జరుగుతుంటాయి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

స్త్రీ మీద అధికారం చెలాయించడానికి పురుషుడు చాలా మార్గాల్లో ప్రయత్నిస్తుంటాడు. ఆమెను కొట్టడమనేది అందులో ఒక భాగం మాత్రమే. అయితే, ఏ రకంగా హింసించినప్పటికీ, అది ఆమెని తీవ్రంగా బాధిస్తుంది.

భావోద్వేగ దుర్వినియోగం: పురుషుడు స్త్రీని అవమానిస్తుంటాడు, ఆమెను అణచివేస్తుంటాడు లేదా తానొక వెర్రి దానినని ఆమె అనుకునేలా చేస్తుంటాడు.

డబ్బును నియంత్రించడం: స్త్రీ ఉద్యోగానికి వెళ్లకుండా లేదా ఆమె సొంతంగా డబ్బు సంపాదించకుండా ఉండేందుకు పురుషుడు ప్రయత్నిస్తాడు. ఆమెకు డబ్బు అవసరమైనప్పుడల్లా తననే అడిగేలా చేస్తాడు లేదా ఆమెతో బలవంతంగా పని చేయింటి, ఆమె సంపాదన మొత్తం తానే తీసుకుంటాడు.

లైంగిక వేధింపు: స్త్రీ ఇష్టానికి విరుద్ధమైన సెక్స్ చేష్టలను పురుషుడు బలవంతంగా చేయిస్తాడు లేదా ఆమె లైంగిక భాగాల మీద దాడి చేస్తాడు. ఆమెను అతడు ఒక వస్తువులా చూస్తాడు.

ఆమెను నిందించడం: నిజానికి దుర్వినియోగమేదీ జరగలేదని, అదేమీ తీవ్రమైనది కాదని లేదంటే అది ఆమె తప్పేనని పురుషుడు చెబుతాడు.

పిల్లలను ఉపయోగించడం: స్త్రీకి అపరాధ భావన కలిగించడానికి లేదా ఆమెను బాధపెట్టడానికి పురుషుడు పిల్లలను ఉపయోగిస్తాడు.

నేను 'మగాడిని' అనే భావన: నేను మగాడిని అని పదే పదే గుర్తుచేస్తూ, స్త్రీని తన సేవకురాలిగా మార్చే ప్రయత్నం చేస్తుంటాడు. నిర్ణయాలన్నీ అతనే తీసేసుకుంటాడు. ఒక స్త్రీగా ఆ నిర్ణయాల పట్ల అభ్యంతరం చెప్పే హక్కు ఆమెకి లేదంటాడు.

బెదిరింపులకు పాల్పడడం: పురుషుడు శారీరక చేష్టలు, చర్యలు, స్వరం పెంచడం ద్వారా, తనను చూసి స్త్రీ భయపడేలా చేస్తాడు.

ఒంటరితనం: స్త్రీ ఎవరిని చూడాలి, ఎవరితో మాట్లాడాలి మరియు ఆమె ఎక్కడికి వెళ్లాలి లాంటివన్నీ నియంత్రించడం ద్వారా, ఆమెని ఒంటరి వ్యక్తిగా మార్చేస్తాడు.

స్త్రీ విషయంలో ఒక రకమైన దుర్వినియోగం తరచుగా మరొక రూపంలోకి మారుతుంటుంది. ఈ అన్ని చేష్టల వెనుక అధికారం మరియు నియంత్రణ అనేవి కారణాలుగా ఉంటాయి.

అనేక సందర్భాల్లో, మాటలతో దూషణ అనేది త్వరగానే శారీరక హింసగా మారుతుంది. మొదట్లో పరిస్థితి అలా అనిపించకపోవచ్చు. కానీ, పురుషుడు నెమ్మదిగా 'అనుకోని విధంగా' స్త్రీని నెట్టడం లేదా కొట్టడం ప్రారంభిస్తాడు లేదా స్త్రీ సాధారణంగా కూర్చునే చోట తాను కూర్చోవడం ప్రారంభించినప్పుడు ఆమె తప్పనిసరిగా దూరంగా వెళ్లాల్సి రావచ్చు. ఈ ప్రవర్తనలు అతనికి ఫలితం ఇస్తే, అతను మరింత హింసాత్మకంగా మారే దిశగా పరిస్థితి దిగజారవచ్చు. ఇతర రకాల దుర్వినియోగానికి గురైన మహిళలందరూ దెబ్బలకు గురై ఉండకపోవచ్చు కానీ, దెబ్బలకు గురైన మహిళలందరూ ఇతర రకాల దుర్వినియోగానికి కూడా గురవుతుంటారు.

Sources
  • Audiopedia ID: tel020104