మహిళల మీద హింస అనేది ఎందుకు పెను సమస్యగా ఉంటోంది
మహిళలను కొట్టడం, తన్నడం, కొట్టడం, అవమానించడం, బెదిరించడం, వారి మీద లైంగిక దుర్వినియోగానికి పాల్పడడం మరియు వారి భాగస్వాములే వాళ్లని హత్య చేయడం లాంటివి ప్రతిరోజూ జరుగుతూనే ఉంటాయి. కానీ, ఇలాంటి హింస గురించి తరచుగా మనకు వినిపించదు. ఎందుకంటే, అలాంటి వేధింపులకు గురైన మహిళలు ఆ విషయం చెప్పడానికి బిడియపడవచ్చు, వాళ్లు ఒంటరిగా ఉండవచ్చు మరియు మాట్లాడటానికి భయపడుతుండవచ్చు. చాలా మంది వైద్యులు, నర్సులు మరియు ఆరోగ్య కార్యకర్తలు సైతం ఈ హింసను తీవ్రమైన ఆరోగ్య సమస్యగా గుర్తించరు.
మహిళలు మరియు బాలికల మీద జరిగే వివిధ రకాల హింస గురించి, ఆ హింస ఎందుకు జరుగుతుందో, ఆ విషయంలో మీరేం చేయవచ్చు మరియు మీ సమాజంలో మార్పు కోసం మీరు ఏవిధంగా పనిచేయవచ్చో మీరు అర్థం చేసుకోవడంలో ఈ అధ్యాయం మీకు సహాయపడుతుంది.
ఒక మహిళ మరియు ఒక పురుషుడి మధ్య హింస గురించే ఈ అధ్యాయం పేర్కొన్నప్పటికీ, ఏ సన్నిహిత సంబంధంలోనైనా ఇలాంటి హింస జరగవచ్చు. ఉదాహరణకు, అత్త మరియు ఆమె కొత్త కోడలి మధ్య, తల్లిదండ్రులు మరియు వారి పిల్లల మధ్య, పెద్ద మరియు చిన్న పిల్లల మధ్య, ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు మరియు వయోవృద్ధుల మధ్య, మరియు స్వలింగ భాగస్వాముల మధ్య కూడా ఇలాంటి హింస ఉండవచ్చు.