మాదకద్రవ్యాలు మరియు మద్యం తీసుకోవడమనేది ఒక మహిళగా నాకు ఏమేరకు ప్రమాదకరం

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

మాదకద్రవ్యాలు లేదా మద్యం దుర్వినియోగానికి పాల్పడినప్పుడు మగవారికి వచ్చే సమస్యలతో పాటు మహిళల్లో మరికొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి:

అధిక మొత్తంలో మద్యం తాగే లేదా చాలా ఎక్కువగా మాదకద్రవ్యాలు తీసుకునే మహిళలకు పురుషులతో పోలిస్తే, కాలేయ వ్యాధి వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది.

చాలా మంది మహిళలు మరియు బాలికలు మద్యం తాగినప్పుడు లేదా మాదకద్రవ్యాలు తీసుకున్నప్పుడు వాళ్లు అవాంఛిత పరిస్థితిలోకి నెట్టవేయబడుతారు. తద్వారా, అవాంఛిత గర్భం, HIV ఇన్ఫెక్షన్ లేదా ఇతర STIలు సోకవచ్చు.

గర్భిణీ స్త్రీ మద్యం తాగినప్పుడు, ధూమపానం చేసినప్పుడు లేదా మాదకద్రవ్యాలు ఉపయోగించినప్పుడు ఆ ప్రభావం కడుపులో బిడ్డ మీద కూడా పడుతుంది. గర్భధారణ సమయంలో ఆమె అలాంటివి చేస్తే, మాదకద్రవ్యాలు మరియు మద్యం కారణంగా వచ్చే లోపాలు మరియు మానసిక వైకల్యాలతో పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. అవి:

  • గుండె, ఎముకలు, జననేంద్రియాలు మరియు తల మరియు ముఖంలో సమస్యలు.
  • జనన సమయంలో తక్కువ బరువు.
  • పెరుగుదల నెమ్మదించడం.
  • అభ్యసన సంబంధిత ఇబ్బందులు మరియు మానసిక ఎదుగుదలలో మందగింపు.
  • ప్రవర్తనా సమస్యలు.
  • జన్మించిన శిశువు కూడా మాదకద్రవ్యాల మీద ఆధారపడవచ్చు మరియు తల్లి లాగే శిశువులోనూ ఉపసంహరణ సంకేతాలు కనిపించవచ్చు.

మహిళలు మరింతగా అసస్య భావనకు గురవుతారు: చాలా సమాజాల్లో, పురుషులతో పోలిస్తే, బహిరంగ ప్రదేశాల్లో మహిళల ప్రవర్తన కఠినమైన నియంత్రణ ఉంటుంది. మద్యం లేదా మాదకద్రవ్యాలు తీసుకోవడం పురుషుల్లో సాధారణమే అని తరచుగా భావించినప్పటికీ, మహిళలు అలా చేయడాన్ని అంగీకరించరు. ఎక్కువ మద్యం లేదా మాదకద్రవ్యాల వినియోగం కారణంగా, ఒక మహిళ తన ప్రవర్తనలో నియంత్రణ కోల్పోతే, ఆమెకి ఇతరులతో అక్రమ లైంగిక సంబంధాలు లేనప్పటికీ, ఆమెని 'నీచమైన మహిళ'గా భావిస్తారు. కాబట్టి, మాదకద్రవ్యాల లేదా మద్యం దుర్వినియోగం బహిర్గతమైనప్పుడు ఎదురయ్యే అమర్యాదను నివారించడం కోసం ఒక మహిళ ఒకేసారి ఎక్కువ తాగడం కంటే, దీర్ఘకాలం పాటు నిర్ణీత మోతాదులో త్రాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రకమైన మద్యపానం వల్ల తన ప్రవర్తన మీద ఆమెకి నియంత్రణ సులభతరంగా ఉంటుంది. అయితే, ఆమె తన దుర్వినియోగాన్ని రహస్యంగా ఉంచుకోవడం వల్ల చికిత్స తీసుకోవడం వాయిదా వేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రవర్తనలన్నీ కలిపి మద్యం లేదా మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల వచ్చే హానిని మరింత పెంచుతాయి.

మద్యం మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగ వల్ల ప్రత్యేకించి కుటుంబంలో హింసాత్మక పరిస్థితులు మరింత తీవ్రమవుతాయి: మాదకద్రవ్యాలు మరియు మద్యం దుర్వినియోగానికి పాల్పడే భాగస్వామి ఉండే మహిళలు తరచుగా గాయపడడమే కాకుండా, మరణానికి కూడా గురికావచ్చు.

Sources
  • Audiopedia ID: tel010306